Arup Kumar Goswami: ఏపీ సీజేగా జస్టిస్ అరూప్ గోస్వామి ప్రమాణం
Arup Kumar Goswami To Take Oath As AP High Court CJ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అరూప్ గోస్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేటి ఉదయం 10 గంటలకు ఏకే గోస్వామి చేత ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు.
Arup Kumar Goswami To Take Oath As AP High Court CJ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అరూప్ గోస్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేటి ఉదయం 10 గంటలకు ఏకే గోస్వామి చేత ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు మంగళవారమే పూర్తి చేశారని సమాచారం.
ఏపీ సీజేగా అరూప్ గోస్వామి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)తో పాటు పలువురు ఉన్నతాదికారులు పాల్గొంటారు. ప్రమాణం చేసిన అనంతరం చీఫ్ జస్టిస్ ఏకే గోస్వామి ఏపీ హైకోర్టుకు చేరుకుని తన బాధ్యతలు ప్రారంభించనున్నారు. అరూప్ గోస్వామి మంచి క్రీడాకారుడు కూడా. అసోం క్రికెట్ జట్టుకు రంజీల్లో ప్రాతినిథ్యం వహించారు. అండర్ 19, అండర్ 22 విభాగాలలో ఈస్ట్ జోన్ తరఫున ఆడారు. సీనియర్ క్రికెట్ ఎంట్రీలో ఆడినట్లు సమాచారం.
Also Read: AP Jobs 2021: కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు.. చివరి తేదీ జనవరి 8
మార్చి 11, 1961న అసోంలో అరూప్ కుమార్ గోస్వామి జన్మించారు. గువాహటి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గోస్వామి, 1985లో గవర్నమెంట్ లా కాలేజీ నుంచి ఎల్ఎల్‌బీ పట్టా పొందారు. అసోం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ బార్ కౌన్సిల్స్‌లో అడ్వకేట్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నియమితులయ్యారు.
Also Read: Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి ధర పైపైకి!
2012లో అసోంలో జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 6, 2018లో గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం అక్టోబర్ 15, 2019 నుంచి సిక్కిం హైకోర్టు సీజేగా వ్యహరించారు. గత వారం ఆయనను ఏపీ సీజేగా నియమించడం తెలిసిందే.
Also Read: Xiaomi Mi 10i Price: భారత్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ లాంచ్, ఫీచర్లు, ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook