KA Paul on RGV: ఆర్జీవీపై కోర్టుకెక్కనున్న కేఏ పాల్... లీగల్ నోటీసులు పంపిస్తానని వార్నింగ్..
KA Paul on RGV: కాంట్రావర్సీకి కేరాఫ్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ షాకిచ్చారు. వర్మపై కోర్టుకెక్కనున్నట్లు తెలిపారు.
KA Paul on RGV: కాంట్రావర్సీకి కేరాఫ్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ షాకిచ్చారు. వర్మపై కోర్టుకెక్కనున్నట్లు తెలిపారు. తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు. తన వీడియోను మార్ఫింగ్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాంగోపాల్ వర్మను ట్యాగ్ చేస్తూ కేఏ పాల్ ట్వీట్ చేశారు.
అసలు విషయానికొస్తే... ఇటీవల కేఏ పాల్ ఫేస్ బుక్ వేదికగా లైవ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ 'ఆర్ఆర్ఆర్' సినిమా చూశారా అంటూ పాల్‌ను అడిగారు. దీనిపై స్పందించిన కేఏ పాల్.. 'అదెక్కడి మూవీ.. మీకేమీ పనీ పాటా లేవా...? రోజూ సినిమాలు చూడటమేనా.. టైమ్ వేస్ట్ చేయడమేనా..? అంటూ ప్రశ్నించారు. అయితే ఇదే వీడియోలో కేఏ పాల్ వాయిస్‌కి మిమిక్రీని జోడించి... ఆర్జీవీ డేంజరస్ సినిమా ప్రమోషన్‌కి వాడుకున్నారు.
'మీ చుట్టుపక్కల ఉన్నవారందరినీ ఈసారి తప్పనిసరిగా ఆర్జీవీ డేంజరస్ సినిమాను అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడాలి. ఎవరెవరు ఏవేవో సినిమాలు తీస్తే ఫస్ట్ డే వెళ్లి చూస్తారు. టైమ్ వేస్ట్ తప్ప దానివల్ల వచ్చే లాభమేంటి. ఏవైనా అర్థవంతమైన సినిమాలు ఉంటే చూడాలి. నా దృష్టిలో అర్థవంతమైన మూవీ డేంజరస్..' అంటూ కేఏ పాల్ వీడియోకి మిమిక్రీ వాయిస్‌ను జోడించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాల్... తన ఆడియోని మార్ఫింగ్ చేసినందుకు వర్మపై చర్యలకు సిద్ధమైనట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కాగా, లెస్బియన్ కథాంశంతో తెరకెక్కించిన 'డేంజరస్' సినిమాను ఆర్జీవీ తెలుగులో 'మా ఇష్టం' పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నైనా గంగూలీ, అప్సర రాణి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 8న విడుదల కాబోతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook