Airtel Prepaid Plans: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్... చౌక ధరలో 30 రోజుల వాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్స్..

Airtel Prepaid Plans: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ 30 రోజుల వాలిడిటీతో కూడిన మంత్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ప్లాన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2022, 08:27 PM IST
  • ఎయిర్‌టెల్ నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్
  • 30 రోజుల వాలిడిటీతో ఎయిర్‌టెల్ అందిస్తోన్న ప్లాన్స్
  • పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
Airtel Prepaid Plans: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్... చౌక ధరలో 30 రోజుల వాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్స్..

Airtel Prepaid Plans: సాధారణంగా టెలికాం సంస్థలు మంత్లీ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్‌ను 30 రోజులకు బదులు 28 రోజుల వాలిడిటీతో అందిస్తుంటాయి. ఇటీవల టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మొదటిసారిగా 30 రోజుల వాలిడిటీతో కూడిన మంత్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు జియో బాటలోనే మరో టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కూడా 30 రోజుల వాలిడిటీతో కూడిన మంత్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ప్లాన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

ఎయిర్‌టెల్ రూ.296 రీచార్జ్ ప్లాన్ :

ఎయిర్‌టెల్ రూ.296 రీచార్జ్‌తో 30 రోజుల వాలిడిటీని అందిస్తోంది. ఈ రీచార్జ్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 4జీ స్పీడ్‌తో 25 జీబీ డేటా పొందవచ్చు. డేటా లిమిట్ దాటితే ఒక ఎంబీ డేటాకి 50 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. అంతేకాదు, 30 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మొబైల్ ఎడిషన్‌ ఫ్రీ ట్రయల్ పొందవచ్చు. ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా పొందవచ్చు. అలాగే ఎయిర్‌టెల్ వింక్ యాక్సెస్‌తో పాటు హలో ట్యూన్స్ పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.310 ప్రీపెయిడ్ ప్లాన్ :

ఎయిర్‌టెల్ అందించే రూ.310 ప్లాన్‌తో 30 రోజుల వాలిడిటీ పొందవచ్చు. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 2 జీబీ చొప్పున నెలకు 56 జీబీ లేదా 62 జీబీ డేటా పొందుతారు. డేటా లిమిట్ దాటితే నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కి పడిపోతుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. అలాగే ఎయిర్‌టెల్ వింక్ యాక్సెస్‌తో పాటు హలో ట్యూన్స్ పొందవచ్చు.

ట్రాయ్ తాజా ఆదేశాలతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ :

ఇటీవల టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) జారీ చేసిన ఆదేశాల ప్రకారం... ప్రతీ టెలికాం సంస్థ 30 రోజుల వాలిడిటీతో కనీసం ఒక రీచార్జ్ ప్లాన్‌ అయినా అందించాలి. తిరిగి ఆ రీచార్జ్ గడువు ముగిసే రోజు మళ్లీ అదే ప్లాన్‌తో రెన్యువల్ చేసుకునే వెసులుబాటు ఉండాలి. ఈ ఆదేశాలతో రిలయన్స్ జియో రూ.259తో 30 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా అదే బాటలో ఎయిర్‌టెల్ కూడా 30 రోజుల వాలిడిటీ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Also Read: Niharika Konidela: నిహారిక తప్పు లేదు.. అనవసర ఊహాగానాలు వద్దు... నాగబాబు రియాక్షన్

DrugsQueenNiharika: నిహారికపై ట్విట్టర్‌లో ట్రోలింగ్... ట్రెండింగ్‌లో 'డ్రగ్స్ క్వీన్ నిహారిక' హాష్‌ట్యాగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News