కడప జిల్లాలో దారుణం జరిగింది.   రోడ్డు ప్రమాదం.. కారణంగా ఓ ఆర్టీసీ బస్సు పూర్తిగా  కాలిపోయింది.  కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఈ ఘటన జరిగింది. శెట్టిగుంట లక్ష్మి గారి పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. కడప నుంచి తిరుపతి వెళ్తున్న non-stop ఆర్టీసీ బస్సును ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రమాదంలో స్కూటరిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు స్కూటర్ పెట్రోల్ ట్యాంక్ పేలిపోవడంతో ఒక్కసారిగా బస్సుకు మంటలు అంటుకున్నాయి. బస్సు కింద ఉన్న స్కూటర్ కు చెలరేగిన మంటలు .. క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. ఇంతలోనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ . .  ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.  కానీ  ప్రమాదంలో  బస్సు పూర్తి గా దగ్ధమైంది.


[[{"fid":"181910","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ప్రయాణీకులు ఇచ్చిన సమాచారంలో వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది .. మంటలను ఆర్పివేశారు. కానీ బస్సు చివరి సీట్లో కూర్చున్న వ్యక్తికి మంటలు అంటుకుని మృతి చెందారు. ఆ సీట్లో ఉన్న వ్యక్తి మృతదేహం మాంసపు ముద్దలా తయారైంది. కనీసం ఆడ, మగ కూడా గుర్తు పట్టలేని విధంగా పరిస్థితి ఉంది.