వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్పందించారు.  వివేకానంద ఒంటిపై ఉన్న గాయాలను పరిశీలిస్తే వివేకానందరెడ్డిది రెడ్డిది హత్యగానే భావిస్తున్నామన్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టును పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉందన్నారు . 


విచారణ కోసం సిట్ ఏర్పాటు....
ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు గుర్తించామన్నారు. వివేక గదిలో వేలిముద్రలు, ఫుట్ ఫ్రింట్ సేకరిస్తున్నామని... డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించామన్నారు. హత్య జరిగిన వివేకా ఇంటి  వెనుక తలుపు తెరిచే ఉన్నాయన్నారు.రాత్రి 11:30 నుంచి ఉదయం 6 గంటల వరకు ఇంటికి ఎవరు అనే దాని ఆరా తీస్తున్నామన్నారు. ఈ హత్య కేసు దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియాకు వివరించారు