ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. తాజాగా కాకినాడ ఎంపీి వంగాగీత కరోనా వైరస్ బారిన పడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంగా గీత కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణైంది. రెండ్రోజుల్నించి కోవిడ్ లక్షణాలు కన్పించడంతో జీజీహెచ్ లో పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ గా నిర్ధాణైంది. స్వల్ప లక్షణాలే ఉండటంతో ఎంపీ వంగా గీత హోం ఐసోలేషన్ కు వెళ్లారు. ఇటీవలి కాలంలో కాకినాడ పార్లమెంట్ పరిధిలోని కోవిడ్ ఆసుపత్రుల సందర్శనతో పాటు నియోజకవర్గ పర్యటన కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోవిడ్ వైరస్ సోకినట్టు వైద్యులు తెలిపారు. ఏపీలో ఇంకా పెద్దఎత్తున కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. గత 24 గంటల్లో 9 వేల 9 వందల కరోనా కేసులు వెలుగు చూశాయి.


తనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో...తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని...పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. Also read: AP: మెడికల్ కళాశాలల ఏర్పాటుకు భారీగా నిధుల కేటాయింపు