Kalingiri Shanthi Clears Allegations: సస్పెన్షన్‌కు గురయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతి తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై వివరణ ఇచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు విజయ సాయిరెడ్డితో వివాహేతర సంబంధం ఆరోపణలు రావడంతో ఆమె దుఃఖించారు. ఆయనతో తనకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. రూ.వంద కోట్లు సంపాదించానని చెబుతున్నవారు అదెలా సాధ్యమో చెప్పాలని సవాల్‌ విసిరారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Vijayasai Reddy: విజయసాయి వల్లే నా భార్య ప్రెగ్నెంట్.. కేసు పెట్టిన లేడీ కమిషనర్ భర్త..


దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తూ ఇటీవల  సస్పెండ్‌కు గురయిన శాంతికి, ఆమె భర్త మదన్‌ మోహన్‌ మధ్య తెగదెంపులు అయ్యాయి. అయితే ఇటీవల మదన్‌మోహన్‌ భన భార్యపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విజయసాయి రెడ్డితో లైంగిక సంబంధం ఉందని మదన్ మోహన్ ఆరోపణలను చేయడాన్ని ఖండించారు. విజయవాడలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

Also Read: Chandrababu Naidu: చంద్రబాబు సంచలనం.. నడిరోడ్డుపై ప్రజల కోసం ఆపిన కాన్వాయ్‌


తనకు మదన్ మోహన్‌కు కొన్నేళ్ల కిందటే సంబంధాలు తెగిపోయాయని శాంతి స్పష్టం చేశారు. డబ్బు కోసమే తనపై మదన్ మోహన్ అసత్య ఆరోపణలు చేశాడని మీడియా ముఖంగా ఆమె బోరున విలపించారు. అతడితో విడిపోయాక తాను మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. విజయ సాయిరెడ్డి వ్యవహారంపై స్పందిస్తూ.. 'నేను విశాఖపట్నంలో పని చేసినప్పుడు వైసీపీ తరఫున  విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇంచార్జి కావడంతో డ్యూటీ విషయంలో  కలిశాను. కలసినంత మాత్రానా ఆయనతో నాకు లైంగిక సంబంధం అంటగడతారా? ఇది పద్ధతి కాదు' అని విలపిస్తూ శాంతి తెలిపారు. విజయసాయి రెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.


'నవంబర్ 2013లో మాకు పెళ్లి అయ్యింది. 2015లో మాకు ఇద్దరు కవల పిల్లలు కలిగారు. నేషనల్ ఓవర్సీసీస్ స్కాలర్‌షిప్ ఇంటర్వ్యూకి వెళ్లాం. మదన్‌మోహన్ మానిపాటి అప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. రెండేళ్లు నన్ను దారుణంగా హింసించాడు. దీంతో 2016లో మేము విడాకులు రాసుకున్నాం. మా గిరిజన సంప్రదాయం ప్రకారం విడాకులు రాసుకున్నాం. 2019లో మదన్ మోహన్ అమెరికా వెళ్లిపోయాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది' అని శాంతి వివరించారు.


'అనంతరం పరిచయమైన న్యాయవాది సుభాశ్‌ను ఇష్టపడ్డా. మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. సుభాశ్‌ని పెళ్లి చేసుకున్నాక కూడా నన్ను మదన్‌ మోహన్‌ వేధించాడు. మదన్ మోహన్, నేను ఇద్దరం కూడా విశాఖపట్నం కోర్టులో  విడాకులు కి తీసుకున్నాం. రాజకీయ కక్షలోకి తనను లాగకండి అంటూ విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగతంగా ఇంతటి దారుణాలు ఎలా చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు. మదన్ మోహన్ మీద తాను కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తాను చచ్చిపోతే తన చావుకి ఈ ఆరోపణలు చేసినవాళ్లే కారణమవుతారని తెలిపారు. ఈ సందర్భంగా తనపై అసభ్యంగా.. తీవ్ర ఆరోపణలు చేసిన కొన్ని మీడియా సంస్థలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి