Village Boycott Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారశైలి ప్రభుత్వానికే కాదు..గ్రామ ప్రజలకు కూడా ఆగ్రహం తెప్పిస్తున్నట్టుంది. అందుకే బాహాటంగానే ఆ నిర్ణయం తీసుకున్నారు గ్రామస్థులు. ఇంతకీ ఏం జరిగింది..ఆ గ్రామమేంటి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీలో పంచాయితీ ఎన్నికల ( Ap Panchayat Elections ) ప్రారంభమైనప్పటి నుంచీ రోజుకో పంచాయితీ జరుగుతోంది. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు ప్రభుత్వానికి..ప్రభుత్వ పెద్దలకు వివాదం, ఆరోపణలు రేగుతూనే ఉన్నాయి. పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra reddy )పై ఆంక్షలు విధించడం పరాకాష్టకు చేరింది. మంత్రి పెద్దిరెడ్డి కోర్టును ఆశ్రయించడంతో..నిమ్మగడ్డ ఉత్తర్వుల్ని హైకోర్టు ( High court ) కొట్టివేసింది. గ్రామ స్వరాజ్యం కోసం పంచాయితీల్ని ఏకగ్రీవం ( Unanimous ) చేసుకోవాలని..ప్రచారం చేసిన ప్రభుత్వం నజరానాల్ని ప్రకటించింది. ఎన్నికల విషయంలో ప్రభుత్వంతో ఘర్షణ పెట్టుకున్న నిమ్మగడ్డ..ఏకగ్రీవాలు వద్దని..ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పడానికి ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా ఎకగ్రీవాలు ఎక్కువగా ఉంటే పరిశీలన చేస్తామని కూడా చెప్పారు. అంతేకాదు గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో జరిగిన ఏకగ్రీవాలపై సీరియస్ అయ్యారు. 


ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh kumar ) ఏకగ్రీవాలపై చేసిన వ్యాఖ్యలు ఆ గ్రామస్థులకు ఆగ్రహం కల్గించాయి. పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ( Gautam reddy ) ప్రాంతంలో పంచాయితీ ఎన్నికలు సంచలనంగా మారాయి. నిమ్మగడ్డ వైఖరిపై నెల్లూరు జిల్లా కంపసముద్రం ( Kampasamudram village ) గ్రామస్థులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఏకగ్రీవాలపై ఆయన చేసిన ప్రకటన నేపధ్యంలో ఎన్నికల్నే బహిష్కరించాలని ( Boycott Elections ) నిర్ణయించారు. నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉన్నంతకాలం పంచాయితీ ఎన్నిక వద్దని గ్రామస్థులు తీర్మానించుకున్నారు. అంతేకాదు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సర్పంచ్ స్థానానికి తొలుత 8మంది అభ్యర్ధులు నామినేషన్ దాఖలు చేసుకోగా..గ్రామస్థుల తీర్మానంతో వెంటనే ఉపసంహరించుకున్నారు. 


Also read: Ap panchayat first phase elections: రేపే తొలిదశ పంచాయితీ ఎన్నికలు, ఫలితాల వెల్లడి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook