Ap panchayat first phase elections: అనేక వివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ప్రారంభమైన పంచాయితీ ఎన్నికల్లో తొలి ఘట్టం రేపటితో ముగియనుంది. ఏపీ పంచాయితీ ఎన్నికల్లో తొలిదశ ఎన్నికలు రేపు అంటే జనవరి 9న జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) రాష్ట్రవ్యాప్తంగా తొలిదశ పంచాయితీ ఎన్నికలు ( First phase panchayat polling )రేపు జరగనున్నాయని పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ( Gopalakrishna Dwivedi ) వెల్లడించారు. మొత్తం 12 జిల్లాల్లోని 2 వేల 724 గ్రామ పంచాయితీల్లో ఎన్నికల కోసం 29 వేల 732 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే 525 పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని..మాస్క్, గ్లవ్స్ శానిటైజర్లు పంపిణీ చేశామన్నారు. మద్యాహ్నం 3.30 వరకూ పోలింగ్ జరుగుతుంది. 4 గంటల్నించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
రేపు జరగనున్న తొలిదశ పంచాయితీ ఎన్నికల కోసం జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు సిద్దంగా ఉన్నారని..కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. 3 సైజుల్లో బ్యాలెట్ బాక్సుల్ని ఎన్నికలకు సిద్ధం చేశామన్నారు. ఈసారి పంచాయితీ ఎన్నికలకు నోటా గుర్తు ఉందన్నారు. నోటాకి పడిన ఓట్ల లెక్కింపు జరగదని చెప్పారు. ఇక గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలపై ఎన్నికల కమీషన్ తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. రేపు జరగనున్న ఎన్నికల్లో అన్ని కేంద్రాలపై వెబ్ కాస్టింగ్ ( Web Casting ) ద్వారా నిఘా ఉండనుంది. కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే..రికార్డు చేసిన డేటాను వినియోగించుకునేలా నిక్షిప్తం చేయనున్నారు. అవసరమైతే నాలుగోదశ ఎన్నికల విధులు కేటాయించిన ఎంపీడీవోలను కూడా రేపు జరిగే ఎన్నికలకు వినియోగించుకోనున్నారు.
Also read: Ys jagan review: అమరావతి ప్రాంత అభివృద్ధిపై వైఎస్ జగన్ సమీక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook