kancha ilaiah: ఎంతకు తెగించాడ్రా..?.. తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై కంచె ఐలయ్య షాకింగ్ కామెంట్స్..
Tirumala lord Balaji: తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై ప్రొఫెసర్ కంచె ఐలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడిది వివాదంగా మారినట్లు తెలుస్తోంది. దీనిపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
kancha ilaiah controversy comments on Tirumala lord Balaji: ఇటీవల కాలంలో పవిత్రమైన తిరుమలను చాలా మంది వివాదాల్లోకి లాగుతున్న ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తిరుమల లడ్డు వివాదం, ఆ తర్వాత తిరుమలలో రీల్స్, ఫోటో షూట్ లు కూడా పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇటీవల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సైతం.. ఈ ఘటనలపై సీరియస్ అయ్యారు.
కొన్ని రోజుల క్రితం తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం.. తిరుమలలో తెలంగాణ వారిపట్ల వివక్షతకు చూపిస్తున్నారని కూడా వివాదాస్పదంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో తాజాగా.. మరోసారి తిరుమల శ్రీవారిపై కంచె ఐలయ్య వివాదస్పదంగా మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా శ్రీవారి భక్తులు సీరియస్ అయినట్లు తెలుస్తొంది.
ప్రొఫెసర్ ఐలయ్య ఇటీవల మహబుబాబాద్ జిల్లా గూడురులో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. అక్కడ దొడ్డికొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా విశ్వవిద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరు పెట్టడం తప్పేమీ కాదన్నారు. ఆమె యోధురాలని, తెలంగాణలో సాయుధ పోరాటంలో పాల్గొన్నారని అన్నారు.
అదే సమయంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి పేర్లు యూనీవర్సీటీలకు ఎందుకటి.. వారికి ఏమైన చదువొచ్చా.. ఏదైన సంఘ సంస్కరణ పనులు చేశారా.. అంటూ నోటీకోచ్చినట్లు మాట్లాడారు. దీంతో ఈ ఘటన కాస్త వివాదం రాజేసిందని చెప్పుకొవచ్చు. దీనిపై శ్రీవారి భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారంట.
వెంటనే ప్రొఫెసర్ ఐలయ్యపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారంట. గతంలో.. కంచె ఐలయ్య..రాసిన సామాజిక స్మగ్లర్లు.. కోమటోళ్లు అనే బుక్ తెలుగు రాష్ట్రాల్లో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కంచె ఐలయ్య మరోవివాదంను రాజేసినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter