Tirumala News: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ తేదీలో మార్పులు.. పూర్తి వివరాలు ఇవే..

Vaikuntha Ekadashi Tickets: తిరుమలకు వైకుంఠ ఏకాదశి వేళ టికెట్లు విడుదల తేదీల్లో మార్పులు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులు ఈ విషయాల్ని గమనించాలని కోరింది.
 

1 /6

తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. మన దేశం నుంచి కాకుండా.. విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తుంటారు. అదే విధంగా స్వామి వారికి తలనీలాలు,అనేక మొక్కులు తీర్చుకుంటారు.  

2 /6

స్వామి వారి దర్శనం అయ్యేవరకు ఎన్ని గంటలైన కూడా.. ఎంత ఆయాసం వచ్చిన క్యూలైన్లలో, కంపార్టీ మెంట్లలో వేచీ చూస్తుంటారు. శ్రీవారిని కన్నుల నిండా చూసుకొవాలని తాపత్రయ పడుతుంటారు. ఈక్రమంలో ప్రస్తుతం ధనుర్మాసం స్టార్ట్ అయ్యింది. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్తుంటారు.  

3 /6

ఈ క్రమంలో.. తాజగా. టీటీడీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని  మార్చి నెల శ్రీవాణి, ఎస్ఈడీ కోటాలో దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తాజాగా ప్రకటించింది.  

4 /6

అదే విధంగా..  వైకుంఠ  ఉత్తర ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

5 /6

ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పును గమనించాలని టీటీడీ ఒక ప్రకనటలో కోరింది. డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు సమాచారం.  

6 /6

ఆతర్వాత.. డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయడం జరుగుతుందని తెలిపింది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తారు. శ్రీవారి భక్తులు మరింత సమాచారం కోసం.. టీటీడీ వెబ్ సైట్.. https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ భక్తులకు కోరినట్లు తెలుస్తొంది.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x