Kanna Resigns BJP: బీజేపీకి షాకిచ్చిన కన్నా.. గుడ్ బై చెబుతూ కీలక ప్రకటన!
Kanna Lakshmi narayana Resigs BJP: గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారమే నిజం అయింది, ఆ పార్టీ మాజీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
Kanna Lakshmi narayana Resigned BJP: గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి తలనొప్పిగా మారిన మాజీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఎట్టకేలకు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లుగా కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. తాజాగా తన అనుచరులతో ఒక సమావేశం ఏర్పాటు చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఈ సమావేశంలోనే బిజెపికి రాజీనామా చేసినట్లు,జాతీయ అధ్యక్ష్యుడు నడ్డాకు రాజీనామా లేఖ పంపారని తన అనుచరులకు వెల్లడించారు.
ఇక ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆయన రాజీనామా మీడియాకు అధికారికంగా ప్రకటించి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఏ పార్టీలో చేరాలి అనే విషయం మీద ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జనసేన నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం కంటే ఆయన ఎక్కువగా జనసేన వైపుకే మొగ్గు చూపుతున్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది.
ఇక ఇప్పుడు ఆ ప్రచారం మేరకే ఆయన జనసేన వైపుకే మొగ్గుచూపుతున్నారు అని, తన అనుచరులతో చర్చించిన తర్వాత దీని గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్లో కీలక నేతగా వ్యవహరించిన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజన అనంతరం బీజేపీ జెండా ఎత్తుకున్నారు. తరువాత ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదా ఇచ్చి బిజెపి గౌరవించింది. అయితే ఎందుకో ఏమో తర్వాత ఆయనని తొలగించి సోము వీర్రాజుకు ఆ పదవి అప్పగించింది.
అప్పటి నుంచే ఆయన బీజేపీతో కాస్త దూరంగా, అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక కొన్నాళ్ల క్రితం ఆయన జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తో భేటీ కావడంతో జనసేన తీర్థం పుచ్చుకోవడం ఖాయం అని ప్రచారం జరిగింది. కానీ ఢిల్లీ పెద్దల నుంచి బుజ్జగింపులు రావడంతో ఆయన కాస్త మెత్తబడ్డారు. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. ఇక ఆయన ఈ రోజు ఎలాంటి ప్రకటన చేస్తారనే అంశం మీద ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.
Also Read: AP Capital City: త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన: మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
Also Read: AP New Capital: ఏపీకు విశాఖే రాజధాని, ప్రభుత్వ వైఖరి మారిందా, మంత్రి బుగ్గన మాటల వెనుక అర్ధమిదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook