AP New Capital: ఏపీకు విశాఖే రాజధాని, ప్రభుత్వ వైఖరి మారిందా, మంత్రి బుగ్గన మాటల వెనుక అర్ధమిదే

AP New Capital: ఏపీకు మూడు రాజధానులనేది అవాస్తవమా.. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం మనసు మార్చుకుందా..రాజధాని విశాఖ మాత్రమేనా. ఏపీ ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాటలు వింటే అవుననే సమాధానం వస్తుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 15, 2023, 07:45 AM IST
AP New Capital: ఏపీకు విశాఖే రాజధాని, ప్రభుత్వ వైఖరి మారిందా, మంత్రి బుగ్గన మాటల వెనుక అర్ధమిదే

అవును..ఏపీ ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ఇకపై మూడు రాజధానులు కానేకాదు. విశాఖపట్నం మాత్రమే రాజధాని కానుంది. విశాఖకు మారిపోతామని..అక్కడి నుంచే పరిపాలన చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన కొద్దిరోజుల్లోనే ఆర్ధికమంత్రి క్లారిటీ ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వం..పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో, అన్ని ప్రాంతాలు సమంగా  అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఏపీకు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామనేది పదే పదే చెబుతున్నమాటలు. న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం ఎంచుకున్నామంటోంది. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉండటమో లేదా ఏపీ ప్రభుత్వం మనసు మార్చుకోవడమో జరిగినట్టుగా కన్పిస్తోంది. 

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు సాక్ష్యంగా కన్పిస్తున్నాయి. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బెంగళూరులో నిర్వహించిన రోడ్ షోలో ఇన్వెస్టర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పిన మాటలు. అందుకే ఇవి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. 

ఈ కార్యక్రమానికి హాజరైన ఇన్వెస్టర్లు అడిగిన ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి బుగ్గన సమాధానాలిచ్చారు. విశాఖపైనే ఎందుకు దృష్టి పెట్టారు, పారిశ్రామిక గ్రోత్ ఏరియా కింద తిరుపతి, విజయవాడల్ని ఎందుకు ఎంచుకోలేదంటూ ఇన్వెస్టర్లు ప్రశ్నించారు. ఐటీ పరిశ్రమలు, సంబంధిత పెట్టుబడుల్ని విశాఖపట్నానికి ఆకర్షించాలనేది ప్రభుత్వ నిర్ణయమని మంత్రి బుగ్గన సమాధానమిచ్చారు. తదుపరి రాజధానిగా ప్రభుత్వం విశాఖనే నిర్ణయించిందని బుగ్గన స్పష్టం చేశారు. 

ఏపీకు మూడు రాజధానులు తప్పుడు సమాచారమే

బెంగళూరులో మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. ఏపీకు మూడు రాజధానులనే అంశం పూర్తిగా తప్పుడు సమాచారమని, పాలన అంతా విశాఖ నుంచే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి బుగ్గన. విశాఖనే పాలనా రాజధానిగా విశాఖనే ఎంచుకునేందుకు కారణం తక్కువ వ్యయంలో మౌళిక సదుపాయాలుండటమేనన్నారు. వాతావరణం, పోర్టులు, పరిశ్రమలున్నందున విశాఖను రాజధానిగా ఎంచుకున్నామన్నారు మంత్రి బుగ్గన. అంటే విశాఖపట్నం ఇకపై కేవలం పరిపాలనా రాజధాని మాత్రమే కాదు..అంతకంటే ఎక్కువే కలిగి ఉండనుందని తెలుస్తోంది. 

కర్నూలు రాజధాని కాదట

ఈ సమావేశంలో మంత్రి బుగ్గన మరో విషయాన్ని స్పష్టం చేశారు. కర్నూలు రాజధాని కాదని..కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి బుగ్గన తెలిపారు. అదే విధంగా గుంటూరులో కూడా అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం మేరకు మూడు ప్రాంతాల అభివృద్ధికి అనుగుణంగా ఈ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇక తిరుపతి ప్రపంచానికే ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పారు.

ప్రపంచంలో విశాఖపట్నం వంటి అందమైన నగరాలు అరుదుగా ఉన్నాయని..హైదరాబాద్, బెంగళూరులాగే విశాఖ కూడా కాస్మోపాలిటన్ నగరంగా మారుతోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. ఐటీ రంగంలో విశాఖలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయన్నారు. 

ఇప్పటి వరకూ చెప్పిందంతా అబద్ధమేనా

ఇదంతా ఓ ఎత్తైతే మరి ఇప్పటి వరకూ చెప్పిన మాటలు, చేసిన ప్రకటనల పరిస్థితి ఏంటనే సందేహాలు వస్తున్నాయి. కేవలం అమరావతిని రాజధానిగా తప్పించేందుకే మూడు రాజధానుల నాటకం ఆడిందా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. మంత్రి బుగ్గన మాటల్ని బట్టి..ప్రదాన రాజధాని కేవలం విశాఖపట్నం మాత్రమేనని..అమరావతి కేవలం అసెంబ్లీ సమావేశాలకు, కర్నూలు హైకోర్టుకే పరిమితం కావచ్చని తెలుస్తోంది. అంటే ఇక ఏపీకు విశాఖ ఒక్కటే ప్రధానమైన, కీలక రాజధాని కానుంది. అమరావతి అసెంబ్లీ సమావేశాలకు, కర్నూలు హైకోర్టు కార్యకలాపాలకే పరిమితం కానున్నాయి. 

Also read: Union Home Ministry: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ బ్యూరో ఛీఫ్ ఏబీపై చర్యలకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News