తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఏపీలో బీజేపి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడినా ప్రయోజనం ఉండదని కన్నా లక్ష్మీనారాయణ తేల్చిచెప్పేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంగతి ఎలా వున్నా.. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం మాత్రం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. 


ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తిరుపతి విచ్చేయనున్న నేపథ్యంలో మోదీ పర్యటన వివరాలు తెలియజేస్తూ తాజాగా కన్నా లక్ష్మీనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.