Mudragada Entry: ముద్రగడ పయనం వైసీపీనే, ఎప్పుడు, ఎక్కడి నుంచి పోటీ
Mudragada Entry: కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రాజకీయ ఊహాగానానలకు తెరదించనున్నారు. ఏ పార్టీలో చేరేది, ఎక్కడి నుంచి పోటీ చేసేది దాదాపుగా నిర్ణయించుకున్నారు. అదే జరిగితే రాజకీయంగా హాట్ టాపిక్ కానుంది.
Mudragada Entry: కాపు ఉద్యమం తరువాత చాలాకాలంగా నిశ్శబ్దంగా ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తానని చెప్పిన ముద్రగడ అందుకు తగ్గ ముహూర్తం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. మరి ఏ పార్టీలో ఎప్పుడు చేరనున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే వివరాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేపట్టిన ఉద్యమం మహోధృతమైంది. టీడీపీ ప్రభుత్వ పునాదుల్ని కదిలించేసింది. ఆ తరువాత చాలాకాలంగా అన్నింటికీ దూరంగా ఉన్నారు. కాపు ఉద్యమం సమయంలో తునిలో జరిగిన హింసాత్మక ఘటనల నేపధ్యంలో అప్పట్లో రాష్ట్ర, రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ముందు రాష్ట్ర పోలీసులు పెట్టిన కేసులు మాఫీ అయ్యాయి. ఇటీవలే రైల్వే కేసుల్లో కూడా కాపు నేతలకు క్లీన్‌చిట్ లభించింది.
ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు అనుకూలంగా ఉంటూ వచ్చారు. ఇటీవల త్వరలోనే రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. ఇప్పుడా సమయం వచ్చినట్టే అన్పిస్తోంది. పొలిటికల్ రీ ఎంట్రీ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మే నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. అతనితో పాటు కుమారుడు కూడా వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. కాకినాడ ఎంపీ లేదా పిఠాపురం అసెంబ్లీకు పోటీ చేయవచ్చని తెలుస్తోంది.
ముద్రగడ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారనున్నాయి. కాపు ఉద్యమనేతగా, సీనియర్ రాజకీయ నేతగా అందరికీ సుపరిచితులు. పాత, కొత్త తరం నేతలతో రాజకీయాలు నడిపిన ఘనత ఆయనది. ముద్రగడ ఏదైనా ఉద్యమం చేపట్టారంటే అది సక్సెస్ అయినట్టే అర్ధం.
ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీ వార్తలు రాగానే అప్పుడే ఆయన ఇంట్లో సందడి పెరుగుతోంది. కాపు నేతలు, అభిమానులు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు కలుసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు లేవు. జనసేన నేతలు ఇప్పటివరకూ సంప్రదింపులు జరపలేదు. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. కాకినాడ ఎంపీ కంటే పిఠాపురం అసెంబ్లీనే ఎంచుకోవచ్చని సమాచారం.
Also read: Rain Alert for AP: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. వచ్చే మూడు రోజుల్లో వర్షాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook