AP Assembly Elections 2024: ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీ గెలుపుకైనా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంతో కీలకం. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సారి ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాపు సామాజిక వర్గాన్ని ఒక తాటి పైకి తీసుకొచ్చేందుకు .. జనసేన గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న జనసేన.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు లెక్కలు కట్టుకుని మరీ అడుగులు వేస్తోంది. టీడీపీకి అండగా ఉండే కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గం తోడైతే.. గెలుపు నల్లేరుపై నడకేనన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ-జనసేన కూటమి పక్కాగా వ్యూహం రచిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారనే ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. అయితే ఇక్కడే అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముద్రగడ  వైసీపీలో చేరతారనుకుంటున్న తరుణంలోనే జనసేన నేతలు ఆయనతో భేటీ కావడం సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనను జనసేనలోకి ఆహ్వానించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలు కూడా ముద్రగడను జనసేన పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన కూటమిలోకి రావటం ద్వారా మేలు జరుగుతుందని ముద్రగడకు సూచించినట్లు సమాచారం. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సైతం ముద్రగడతో భేటీ అయ్యారు. టీడీపీ-జనసేన కూటమిలోకి ఆహ్వానించారు.


ఇప్పటి వరకు వైసీపీకి టచ్‌లో ఉన్న ముద్రగడ తాజాగా తన మనసు మార్చుకుని జనసేన, టీడీపీ కూటమికి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గం గురించి పవన్ కళ్యాణ్ రాసిన లేఖపై బొలిశెట్టి శ్రీనివాస్, ముద్రగడ పద్మనాభం మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ లేఖపై ముద్రగడ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి అడిగితే ఆలోచిస్తాను అని ముద్రగడ పద్మనాభం సూచించినట్లు తెలుస్తోంది. బొలిశెట్టి సమావేశం తర్వాత ముద్రగడ పద్మనాభానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేసినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ నేరుగా ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్తారని చర్చ జరుగుతోంది. ముద్రగడ కుమారుడు గిరిబాబు సైతం తాజా పరిణామాలపై స్పందించారు. వైసీపీలో తన తండ్రి చేయడం లేదని స్పష్టం చేశారు. 


తాజాగా మాజీ క్రికెటర్, కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడితో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వైసీపీలో చేరి.. తర్వాత బయటకొచ్చిన రాయుడితో జనసేనానికి భేటీ కావడం చర్చనీయాంశమైంది. కీలక కాపు నేతలను ఇలా పవన్ కళ్యాణ్ వరుస భేటీలు నిర్వహిస్తుండం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మొత్తమ్మీద పవన్ గట్టి వ్యూహంతోనే ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook