Mudragada Padmanabham: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ఇవాళ మీడయాతో మాట్లాడారు. ఇటీవలి కాలంలో తనపై వస్తున్న వివిధ రకాల విమర్శలు ఒకేసారి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. తనకు నీతి కబుర్లు చెప్పవద్దని గట్టిగానే కొందరికి వార్నింగ్ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్‌తో పాటు తనను విమర్శించేవారిపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తన కుటుంబం రాజకీయాల్లో వచ్చేటప్పటికీ ఇప్పుడున్నవారెవరకీ ఏబీసీడీలు కూడా రావని ఎద్దేవా చేశారు. తన కుటుంబం 1951లో సినిమాల్లో వచ్చేనాటికి ఇప్పుడున్న నటులు కూడా లేరన్నారు. కొందరు సినిమాల్లో హీరో కావచ్చేమో గానీ రాజకీయాల్లో మాత్రం తాను హీరో అని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. రాజకీయాల్లో తాడు, బొంగరం లేనివాడు తనకు పాఠాలు చెబుతున్నాడని మండిపడ్డారు. మీది ఏం పొడుగని మీ వద్దకు రావాలని ప్రశ్నించారు. 


తాను రాజకీయాల్లోకి రావడానికి కారణం కాపులు కాదన్నారు. తాను ఏ ఉద్యమాలు చేసినా బీసీలు, దళితులు ముందున్నారన్నారు. అసలు రాజకీయాలు తమ వద్ద నేర్చుకోవాలని సూచించారు. తనపై రకరకాలుగా తప్పుడు పోస్టింగులు పెడుతున్నారని, మీరు చెప్పినట్టు తానెందుకు రాజకీయాలు చేయాలని ప్రశ్నించారు. జనసేన మరో పార్టీలో కలవడం సంగతేమో గానీ త్వరలో క్లోజ్ అవుతుందని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పిఠాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సులభమేనన్నారు. 


సినిమా వాళ్లు దేనికీ అతీతులు కాదని స్పష్టం చేశారు. వాస్తవం మాట్లాడాలంటే ఎన్టీఆర్ తరువాత ప్రజలు సినిమా నటుల్ని నమ్మలేదన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో చెప్పాలన్నారు. తనకు నీతులు చెప్పడానికి ఆసలాయన ఎవరని ప్రశ్నించారు. ఉద్యమం జరిగినప్పుడు ఎప్పుడైనా వచ్చారా అని నిలదీశారు. నిన్న గాక మొన్న పుట్టి తనను ప్రశ్నించడమేంటని పవన్‌ను కడిగిపారేశారు. జనసేన పోటీ చేసే 20 సీట్ల కోసం తానెందుకు బలవ్వాలని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. 


వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో తానూ ఒకడినని, కొన్ని శక్తులు తనను జగన్ కు దూరం చేశాయన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానన్నారు. 


Also read: AP Elections 2024: తెలుగుదేశం-బీజేపీ-జనసేన పొత్తు పరిణామాలు, ఏపీలో ఈసారి అధికారం ఎవరిది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook