Kia Motors: 2019లో కియా మోటార్స్ అనంతపురం సమీపంలోని పెనుకొండలో కార్ల తయారీ కర్మాగారం స్థాపించింది. అదే ఏడాది డిసెంబర్ నెలలో ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన మొదటి కారును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఇక అప్పట్నించి కంపెనీ ప్లాంట్ విస్తరణ, ఉత్పత్తి ఊపందుకుంది. ఇవాళ చరిత్ర సృష్టించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో పెనుకొండ సమీపంలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఏర్పాటైన కియా మోటార్స్ ఫ్యాక్టరీ నుంచే దేశంలో సరఫరా అవుతున్న కియా కార్లు తయారవుతున్నాయి. 2019 డిసెంబర్ నెలలో తొలి కారు ఉత్పత్తి నుంచి ఇవాళ అంటే జూలై 13వ తేదీ 2023లో 10వ లక్ష కారు తయారీ వరకూ ప్రస్థానం ఘనంగా సాగింది. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఈ ప్లాంట్ నుంచి 10 లక్షల కార్లను కంపెనీ ఉత్పత్తి చేసిందంటే ఆశ్చర్యమన్పిస్తున్నా ఇదే నిజం. కియా మోటార్స్ కంపెనీ సాధించిన ఈ అరుదైన ఘనతపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. కియా ఇండియా యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలు సాధించాలని, ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. 


ఏపీలో కియా మోటార్స్ కంపెనీకి ఏ ప్రభుత్వ హయాంలో బీజం పడిందనే విషయంలో పెద్ద చర్చే జరిగింది. టీడీపీ హయాంలో చంద్రబాబు కృషి వల్లనే కియా మోటార్స్ కంపెనీ వచ్చిందని టీడీపీ వాదిస్తుంటే..వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లనే వచ్చిందని వైసీపీ వర్గాలు వాదించాయి. అదే సమయంయలో 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కియా మోటార్స్ కంపెనీని స్థాపించాలని విజ్ఞప్తి చేశారని కియా మోటార్స్ అధినేత స్వయంగా వెల్లడించడంతో చర్చకు ఫుల్‌స్టాప్ పడింది.


కియా కంపెనీ ఇండియా ప్లాంట్ నుంచి మొదటి కారు 2019 డిసెంబర్ నెలలో ఏపీ ముఖ్యమంత్రి ఆవిష్కరించగా..అంతకుముందే అంటే 20189 ఎన్నికల ముందు చంద్రబాబు కూడా ఓ కారు ఆవిష్కరించారు. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న కారును అనంతపురం ప్లాంట్‌లో ఉత్పత్తి అయినట్టు చూపించి ప్రచారం చేసుకున్నారనే విమర్శలు కూడా చెలరేగాయి. ఆ తరువాత 2019 ఎన్నికల తరువాత కియా మోటార్స్ పరిశ్రమే చెన్నైకు తరలిపోయిందంటూ కూడా టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. దీనికి కూడా కియా ఇండియా యాజమాన్యమే స్పందించి అదంతా అవాస్తవమని తెలిపింది. ఇప్పుుడు కంపెనీ 10వ లక్ష కారు ఇదే ప్లాంట్‌లో తయారు కావడంతో కొత్త రికార్డు సాధించినట్టైంది.


Also read: AP Poll Strategy Survey: ఏపీలో అధికారం ఎవరిది, పోల్ స్ట్రాటజీ సర్వేలో సంచలన విషయాలు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook