Konaseema: ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళలాడే కోన సీమ..ఆందోళనలతో అట్టుడుకుతోంది. పరిస్థితి చేయి దాటిపోకుండా పోలీసులు అప్రమత్తమైయ్యారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఆంక్షలను సైతం కఠినతరం చేశారు.  అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గం, కొత్తపేట, కాట్రేనికోన, రావులపాలెం మండలాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి ర్యాలీలు, నిరసనలు, ఆందోళనలు, బహిరంగసభలకు అనుమతి లేదని జిల్లా పోలీసులు స్పష్టం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఇటీవల ప్రభుత్వం మార్చింది. ఇప్పుడా నిర్ణయం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. జిల్లా పేరును మార్చొద్దంటూ గతకొంతకాలంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును మార్చుతారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆందోళనలు,నిరసనలు మిన్నంటాయి. అప్రమత్తమైన పోలీసులు..అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


అమలాపురంలో నలుగురు డీఎస్పీలతోపాటు 450 మంది పోలీసులను మోహరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లోనూ నిఘాను రెట్టింపు చేశారు. స్పందన, డీడీఆర్‌సీ కార్యక్రమాల వద్ద పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లా చిరునామాతో ఓ శుభలేఖ తీవ్ర కలకలంరేపుతోంది. జిల్లా పేరును సర్కార్‌ మార్చకముందే ఓ యువకుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని తన పెళ్లి పత్రికల్లో ముద్రించాడు. 


అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును మార్చవద్దన్న డిమాండ్ పెరుగుతోంది. ఒకవేళ ప్రభుత్వం మారిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆందోళన కారులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఏపీలో జిల్లాల ఏర్పాటు మంటలు చల్లారటం లేదు. మొన్నటి వరకు జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ నిరసనలు జరిగాయి. ఇప్పుడు జిల్లాల పేర్లను మార్చొద్దన్న డిమాండ్ ఊపందుకుంది.


Also read:Dry Amla Benefits: ఎండు ఉసిరి, జామలో ఎన్నో ఔషధ గుణాలు..జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి..!!


Also read:CM Jagan Tour: వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నాం..దావోస్‌లో సీఎం వైఎస్ జగన్‌ ప్రసంగం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook