Atreyapuram Pootharekulu: వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ రిజిస్ట్రీలో పూతరేకులు చోటుదక్కించుకున్నాయి. భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పూతరేకుల సహకార సంఘం దరఖాస్తు చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర విభాగం ఫిబ్రవరి 13న విడుదల చేసిన జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ (జీఐ) జర్నల్‌లో ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై ప్రకటన జారీ చేసింది. అభ్యంతరాల స్వీకరణకు ఇచ్చిన గడువు ఈనెల 13వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో భౌగోళిక గుర్తింపు వచ్చినట్లయిందని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పూతరేకుల సహకార సంఘం తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ నుంచి ఇప్పటి వరకు కేవలం 18 ఉత్పత్తులకే జీఐ ట్యాగ్ లభించింది. ఇందులో కొండపల్లి బొమ్మలు, తిరుపతి లడ్డూ, ఉప్పాడ జిందానీ చీరలు, బందరు లడ్డూ వంటివి ఉన్నాయి. తాజాగా  ఆత్రేయపురం పూతరేకులకు ఈ జాబితాలో చోటు లభించింది. ఈ పూతరేకులు ఆత్రేయపురంలో 400 ఏళ్ల నుంచి తయారు అవుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి పూర్వీకులు పూతరేకుల తయారీను వృత్తిగా చేసుకుని జీవనం సాగించినట్లు స్థానికులు చెబుతున్నారు. పూతరేకుల తయారీలో మహిళలదే కీలకపాత్ర. బెల్లం, పంచదార, నేతితో తయారైన పూతరేకులతో పాటు డ్రైఫ్రూట్స్‌, చాక్లెట్‌, షుగర్‌ ఫ్రీ, ఇంకా పలు రకాల ఫ్లేవర్లతో పూతరేకులను ఇక్కడ తయారు చేస్తున్నారు. వీటిని దేశ విదేశాలకు విక్రయిస్తున్నారు.  దీన్ని బట్టి ఈ పూతరేకుల క్రేజ్ ఏంటో అర్థం చేసుకోండి.


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి