Krishnapatnam Corona Medicine: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే అపోహలు, ఆరోపణలు వద్దని..ప్రభుత్వ అనుమతి వచ్చాక తిరిగి ప్రారంబిస్తామని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కరోనా మందు(Krishnapatnam Corona Medicine) దేశవ్యాప్తంగా సంచలనమైంది. మందు శాస్త్రీయతపై సందేహాలు నెలకొనడంతో తాత్కాలికంగా ప్రభుత్వం మందు పంపిణీ నిలిపివేసింది. ఆయుష్ (Ayush)వైద్య బృందాల్ని రంగంలో దింపి అధ్యయనం చేయిస్తోంది. ఆయుష్ ఇప్పటికే ప్రాధమికంగా దర్యాప్తు చేసి..మందులో వాడే పదార్ధాలు, తయారీ విధానంలో తప్పులేదని...అయితే శాస్త్రీయత లోపించిందని తేల్చింది. అందుకే నాటు మందుగా పరిగణిస్తామని చెప్పింది. మరోవైపు ఐసీఎంఆర్ (ICMR) బృందం కూడా కృష్ణపట్నంకు చేరుకోనుంది. ఈ నేపధ్యంలో కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై నెలకొన్న ఆరోపణలు, ఆపోహల్ని దూరం చేసేందుకు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంపై అనవసర ఆరోపణలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అనుమతి వచ్చాక తిరిగి మందు పంపిణీ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేవరకూ ఈ విషయాన్ని రాద్ధాంతం చేయవద్దని సూచించారు. అటు ఆనందయ్య కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.


మరోవైపు శ్రీనివాస మంగాపురం ఆయుర్వేద ఫార్మసీ నిపుణులతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భేటీ అయ్యారు. ఆనందయ్య మందును)Anandaiah medicine) ఆయుర్వేద ఫార్మసీ నిపుణులు పరిశీలించారు. ప్రభుత్వం  నుంచి సానుకూల స్పందన వస్తే..మందు తయారీకి సిద్ధమవుతామని ప్రకటించారు. ఆనందయ్య వాడే మందులోని వనమూలికలన్నీ శేషాచలం అడవుల్లో సమృద్దిగా ఉన్నాయన్నారు. 


Also read: AP COVID-19 cases: ఏపీలో తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు.. తగ్గని మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook