Krishnapatnam Medicine: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఇప్పుడు శాస్త్రీయత కల్పించే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అన్నీ సానుకూలంగా జరిగితే ప్రభుత్వమే ఆనందయ్య మందు పంపిణీ చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశాన్ని కరోనా మహమ్మారి(Corona Pandemic)పట్టి పీడిస్తోంది. ప్రపంచమంతా ఇప్పటికీ కరోనా మహమ్మారికి మందు కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరోవైపు కొనసాగుతోంది. ఈ క్రమంలో కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న కరోనా మందు ( Krishnapatnam Medicine) దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆనందయ్య ఇస్తున్న మందు అద్భుతంగా పనిచేస్తుందంటూ వార్తలు రావడంతో పెద్దఎత్తున జనం ఎగబడ్డారు. అదే సమయంలో ఆనందయ్య మందు (Anandaiah Medicine) శాస్త్రీయతపై సందేహాలు నెలకొనడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయుష్, సీసీఆర్ఏఎస్‌లను(CCRAS)రంగంలో దించింది. ఆయుష్ వైద్యుల బృందం ( Ayush) ఇప్పటికే అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆనందయ్య మందుతో సైడ్‌ఎఫెక్ట్స్ లేవని..అయితే ఆయుర్వేదంగా గుర్తించలేమని తెలిపింది. 


మరోవైపు ఇదేమందుపై అద్యయనం చేసి..తయారు చేసి పంపిణీ చేసేందుకు టీటీడీ ఆయుర్వేద కళాశాల ముందుకొచ్చింది. ఆనందయ్య ఇచ్చే మందులో వాడే పదార్ధాలన్నీ అందుబాటులో ఉన్నవేనని..ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉండని తెలిపింది. ప్రభుత్వం అనుమతిస్తే తామే తయారు చేసి పంపిణీ చేస్తామని వెల్లడించింది. మరోవైపు ఈ మందుపై టీటీడీ కమిటీ సర్వే పూర్తి చేసింది. ఏకంగా 570 మందిపై సర్వే చేసిన టీటీడీ కమిటీకు 80 శాతం సానుకూల స్పందన వచ్చినట్టు తేలింది. ఈ నివేదికను సీసీఆర్ఏఎస్‌కు టీటీడీ కమిటీ సమర్పించింది. 


మరోవైపు ఆనందయ్య మందుకు(Anandaiah Medicine) శాస్త్రీయత కల్పించే చర్యల్లో భాగంగా ప్రీ క్లినికల్ ట్రయల్స్( Pre Clinical Trials) నిర్వహించనున్నారు. తిరుపతి సుజనా లైఫ్ ల్యాబ్‌లో ప్రీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ల్యాబ్‌ను పరిశీలించారు. రేపటి నుంచి ఈ ల్యాబ్‌లో జంతువులపై ప్రీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి..15 రోజుల్లో నివేదిక వెలువరిస్తారు. 


Also read: Oxygen Plant: దేశంలోనే మొట్టమొదటి ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook