Oxygen Plant: దేశంలోనే మొట్టమొదటి ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం

Oxygen Plant: కరోనా మహమ్మారి ఉధృతి నేపధ్యంలో తలెత్తిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల్ని నిర్మిస్తోంది. మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ఇవాళ ప్రారంభమైంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 26, 2021, 09:26 PM IST
Oxygen Plant: దేశంలోనే మొట్టమొదటి ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం

Oxygen Plant: కరోనా మహమ్మారి ఉధృతి నేపధ్యంలో తలెత్తిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల్ని నిర్మిస్తోంది. మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ఇవాళ ప్రారంభమైంది.

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) నేపధ్యంలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఈ తరుణంలో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఏపీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల్ని నిర్మిస్తోంది. డీఆర్డీవో, ఎన్‌హెచ్‌ఏ సహకారంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌లను అందుబాటులో తెస్తోంది. ఇందులో భాగంగా నిర్మించిన తొలి ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఇవాళ అందుబాటులో వచ్చింది.

అనంతపురం జిల్లా హిందూపురంలో డీఆర్డీవో, నేషనల్ హైవే అథారిటీ(National Highway Authority) సహకారంతో నిర్మించిన మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని మంత్రి శంకర నారాయణ, ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ ప్రారంభించారు. హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఈ ప్లాంట్‌ను నెలకొల్పారు. కరోనా కట్టడికై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి శంకర నారాయణ తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తున్న రాష్ట్రం ఏపీ అని చెప్పారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన అన్ని చర్యల్ని వైఎస్ జగన్ తీసుకుంటున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్ చెప్పారు. హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో మౌళిక సదుపాయాల్ని పెంచుతామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటైన హిందూపురం ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్(Oxygne Generation Plant) దేశంలోనే మొట్టమొదటిదిగా నిలిచింది. 

Also read: Ap Corona Update: ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి, 24 గంటల్లో 18 వేల కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News