Krishnapatnam Police Filed Case On Somireddy: ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కరోనా మందు త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం వెబ్‌సైట్ (Childeal.in) సిద్ధమవుతోంది. ఆనందయ్య పంపిణీ చేయనున్న కరోనా మందుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో కరోనా మందుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెశ్రిత టెక్నాలజీ ఎండీ నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమిరెడ్డి  చంద్రమోహన్ రెడ్డిపై కృష్ణపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం, చీటింగ్, దొంగతనం, ఫోర్జరీ ఆరోపణలతో మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసులు పెట్టారు. ఆనందయ్య కరోనా మందు (Krishnapatnam Corona Medicine) ను పంపిణీ చేసేందుకు వైఎస్సార్‌సీపీ, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి, సెశ్రిత కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని, ఆయనకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 


Also Read; Anandayya Covid-19 Medicine: ఆనందయ్య కరోనా మందుపై టీటీడీ అందుకే వెనక్కి తగ్గిందా


ఆనందయ్య కరోనా మందును పంపిణీ చేసేందుకు వెబ్‌సైట్‌ Childeal.in ను సెశ్రిత కంపెనీ తయారు చేసిందని, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈ వ్యాపారం చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. తమకు చెడ్డపెరు తీసుకురావాలని ఆరోపణలు చేస్తున్నారని పలు ఆరోపణలతో సెశ్రిత టెక్నాలజీ ఎండీ నందకుమార్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy)పై ఫిర్యాదు చేయగా కృష్ణపట్నం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.


Also Read: India COVID-19 Cases: ఇండియాలో వరుసగా 24వ రోజు పాజిటివ్ కంటే డిశ్ఛార్జ్ కేసులు అధికం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook