పోలవరం జగన్ వల్ల కాదు.. కేంద్రం స్వాధీనం చేసుకోవాలి: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

పోలవరం జగన్ వల్ల కాదు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Updated: Oct 11, 2019, 07:45 PM IST
పోలవరం జగన్ వల్ల కాదు.. కేంద్రం స్వాధీనం చేసుకోవాలి: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయడం జగన్‌ ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనికాదని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే స్వాధీనం చేసుకొని త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టాకా ఏపీలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. కేంద్రం పట్ల జగన్‌ మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని, ఫలితంగా వృద్ధిరేటులో రాష్ట్రం వెనుకబడిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఇష్టంవచ్చినట్టు వ్యవహరించడానికి ఏపీ ప్రైవేట్‌ ఎస్టేట్‌ కాదని సోమిరెడ్డి హితవు పలికారు.