Aghori nagasadhu matha Suicide Attempt video: అఘోరీ మాత ప్రస్తుతం ఏపీలో కూడా హల్ చల్ చేసినట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అఘోరీ నాగసాధు శ్రీకాళ హస్తీశ్వర ఆలయంకు దర్శనానికి వచ్చినట్లు తెలుస్తొంది. కానీ అక్కడున్న సిబ్బంది మాత్రం అఘోరీని లోనికి ప్రవేశానికి అడ్డుపడినట్లు తెలుస్తొంది. దీంతో అఘోరీ కోపంతో ఊగిపోయి.. తన కారులో ఉన్న పెట్రోల్ తన మీద పొసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడ ఉన్న వారంత ఒక్కసారిగా భయపడిపోయినట్లు తెలుస్తొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల ఏపీలో టోల్ ప్లాజా వద్ద అఘోరీ పట్ల  ఒక వ్యక్తి  నీచంగా ప్రవర్తించాడని కూడా వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల అఘోరీ సనాతన ధర్మం  కోసం తన ప్రాణాలనైన అర్పిస్తానని కూడా  చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. ప్రస్తుతం ఇరు తెలుగు స్టేట్స్ లలో అఘోరీ మాత్రం తెగ హల్ చల్ చేస్తున్నట్లు చెప్పుకొవచ్చు. సనాతన ధర్మం కాపాడుకొవాలని, అఘోరీనైన తన పట్ల కొందరు నీచంగా ప్రవర్తించారని, ఇంకా వేరే మహిళల పట్ల ఏవిధంగా ప్రవర్తిస్తారో అర్థం చేసుకొవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.


ఇదిలా ఉండగా... అఘోరీ ఇటీవల ఏపీలోకి వెళ్లి పవన్ కళ్యాణ్ ను కూడా కలవనున్నారని వార్తలు కూడా వచ్చాయి. అదే విధంగా తెలంగాణలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాం ధ్వంసం చేసిన తర్వాత అక్కడికి వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేశారు. అఘోరీ మాత్రం ప్రస్తుతం ఇరు తెలుగు స్టేట్స్ లలో రచ్చగా మారారని చెప్పుకొవచ్చు.


Read more: Aghori: ఏపీలో అఘోరీకి ఘోర అవమానం.. ఛాతీ మీద చెయ్యివేసి మరీ..


శ్రీకాళ హస్తిలో అఘోరీ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. వెంటనే అక్కడున్న సిబ్బంది నీళ్లు పోసి.. అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించి, మళ్లీ స్థానికంగా ఉన్న పీఎస్ కు తరలించినట్లు తెలుస్తొంది. అఘోరీ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.