Aghori: త్రిశూలంతో వ్యక్తిపై అఘోరి దాడి..
Aghori: లేడీ నాగ సాధు అఘోరి.. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసే వరకు కదిలే ప్రసక్తే లేదంటూ ఉదయం నుంచి హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో అఘోరీ రెచ్చిపోయింది. అంతేకాదు తన చేతిలోని త్రిశూలంలో ఓ వ్యక్తిని గాయపరిచడం కలకలం రేపుతోంది.
Aghori: గత కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి మస్తు పాపులర్ అయింది. తాజాగా ఈమె ఆంధ్ ప్రదేశ్ లోని మంగళగిరిలో సంచరిస్తోంది. అంతేకాదు అక్కడ జనసేనాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు గుంటూరు జిల్లా మంగళగిరికి వెళ్లింది. అక్కడ ఈ లేడీ నాగ సాధువు త్రిశూలంలో ఓ వ్యక్తిపై దాడికి దిగింది. దీంతో సదరు వ్యక్తి కాలు విరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
మరోవైపు మంగళగిరిలో హైవేపై లేడీ అఘోరీ హల్ చల్ చేసింది. పవన్ కల్యాణ్ రావాలంటూ రోడ్డుపై ఆందోళనకు దిగిన అఘోరీ... బాధితుడిపై ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడింది. దీంతో స్థానికులు అడ్డుకున్నారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని హుటాహుటిన NRI ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అఘోరీ తీరుపై స్థానికులు సీరియస్ అవుతున్నారు. మరోవైపు అఘోరీని.. ఓ స్వామీజితో మాట్లాడించి ఆమెను శాంతింపజేసినట్లు తెలుస్తోంది. మంగళగిరి నుంచి అఘోరీని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున సికింద్రాబాద్ లో ఉన్న ముత్యాలమ్మ దేవాలయంపై దాడి ఘటన తర్వాత ఒక్కసారి ఈమె లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ఘటనలపై స్పందిస్తోంది. అయితే.. నాగ సాదువులు.. అఘోరీలు సామాజిక జనజీవనానికి.. వ్యక్తిగత ప్రతిష్ఠకు చాలా దూరంగా ఉంటారు. అందుకు భిన్నంగా లేడీ అఘోరి తీరు ఉండటంపై కొంత మంది ఆధ్యాత్మిక, హిందూ సంఘాల నేతలు అఘోరీ తీరుపై మండిపడుతున్నారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter