Gorantla Madhav Live Updates: వీడిన ఉత్కంఠ.. గోరంట్ల వీడియో ఫేక్ అన్న ఎస్పీ.. `నేను కడిగిన ముత్యం: `గోరంట్ల మాధవ్

Wed, 10 Aug 2022-7:50 pm,

Gorantla Madhav: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

Gorantla Madhav:  తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. న్యూడ్ వీడియోకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికను అనంతపురం జిల్లా పోలీసులు బయటపెట్టారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఫేక్ అని చెప్పారు ఎస్పీ ఫకీరప్ప. ఆ వీడియోను మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండవచ్చన్నారు.

Latest Updates

  • ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఫేక్ అంటూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చేసిన ప్రకటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలని ప్రశ్నించారు. వీడియో ఒరిజనల్ కాదని ఏ ఫోరెన్సిన్ నివేదిక ఇచ్చిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒరిజినల్ ఉందని ఎస్పీ భావిస్తున్నారా అని లోకేష్ ప్రశ్నించారు.

  • కొంతమంది దుర్మార్గులు చేసిన పని ఇది- గోరంట్ల మాధవ్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ఈ వీడియో మార్ఫింగ్ అని ఆ రోజే చెప్పాం- గోరంట్ల మాధవ్

    ఇది చంద్రబాబు నారా లోకేష్ కుట్ర- గోరంట్ల మాధవ్

    ఇకనైనా చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలి-మాధవ్

     

  • ఈనెల 4వ తేదీ అర్ధరాత్రి 2-07 గంటలకు వీడియో పోస్ట్ చేశారు

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ఇంటర్ నేషనల్ నెంబర్ కావడంతో ఆ వ్యక్తి  ఎవరన్నది దర్యాప్తు చేస్తున్నాం

     

  • ఒరిజినల్ వీడియో దొరికితేనే నిజమా.. మార్పింగా అని చెప్పగలం

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ఒక వ్యక్తి పంపిన వీడియోను షూట్ చేసి మరో వ్యక్తి అప్ లోడ్ చేశాడు

    ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగలం

     

  • ఈ వీడియో మొదట iTDP Offcial వాట్సాప్ గ్రూప్ లో మొదటగా పోస్ట్ చేశారు

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    యూకే రిజస్టర్ అయిన నెంబర్ తో మొదట వీడియో అప్ లోడ్ అయింది

    ఒరిజినల్ వీడియో దొరికే దాకా ఏమి చెప్పలేం

    ఆ వీడియోను వేరే మొబైల్ తో చిత్రీకరించారు

     

  • ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు- అనంతపురం ఎస్పీ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ఈ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండవచ్చు

    ఈ వీడియోకు సంబంధించి ఎవరూ ఫిర్యాదు చేయలేదు

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజనల్ కాదు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link