Andhra Pradesh Rains Live: ఏపీలో కుంభవృష్టి.. భారీ వర్షాలతో విజయవాడ, గుంటూరు అతలాకుతలం

Sat, 31 Aug 2024-5:43 pm,

AP Rains Live Updates: భారీ వర్షాలతో ఏపీలో జనజీవనం స్తంభించిపోయింది. విజయవాడ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

AP Rains Live Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలతో విజయవాడ, గుంటూరు నగరాలు అతలాకుతలం అవుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుల్లో అధికారులు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఎవరూ బయటకు రావద్దని కోరుతున్నారు. ఏపీ వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

Latest Updates

  • Andhra Pradesh Rains Live News: అమరావతి: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి కొల్లు రవీంద్ర టెలీకాన్ఫరెన్స్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> భారీగా కురుస్తున్న వర్షాలపై ప్రజల్ని అప్రమత్తం చేయాలి

    ==> లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

    ==> వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలి

    ==> విజయవాడలో పలు ప్రాంతాలు నీట మునగడంపై ఆరా

    ==> నీళ్లు నిలిచిపోయిన ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలి

    ==> కాలువల్లో నీరు పారేలా అడ్డంకులు తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశం

    ==> మ్యాన్ హోల్స్, విద్యుత్ స్తంభాల విషయంలో అప్రమత్తం చేయండి

    ==> అధికారులు వర్ష ప్రభావం తగ్గే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలి

    ==> ప్రజా ప్రతినిధులంతా అందుబాటులోనే ఉన్నారు

    ==> వారితో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి

  • Andhra Pradesh Rains Live Updates: కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గoలోని నున్న జంగమవాని చెరువుకి గండి పడింది. దీంతో పంట పొలాల్లోకి వస్తున్న నీరు చేరడంతో వరి పొలాలు మునిగిపోతున్నాయి.
     

  • Andhra Pradesh Rains Live Updates: ప్రజల కోసం భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యోగం చేస్తున్న మంగళగిరి రూరల్ ఎస్సై.. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> టోల్ ప్లాజా వద్ద రాకపోకలు బందు చేస్తే మంచిదని సూచన.. 

    ==> మంగళగిరి టోల్ ప్లాజా వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం*

    ==> గుంటూరు ఆటోనగర్, పెద్దకాకాని పోలీస్ స్టేషన్ సమీపమంతా జలమయం

    ==> టోల్‍గేట్ వద్ద ప్రధాన రహదారికి భారీగా నీటి చేరికతో ట్రాఫిక్ ఇబ్బందులు

    ==> వరద నీటితో జలాశయాన్ని తలపిస్తున్న మంగళగిరి టోల్‍ప్లాజా ప్రాంతం

    ==> గుంటూరు, విజయవాడ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

    ==> ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసుల  విజ్ఞప్తి

  • Andhra Pradesh Rains Live Updates: కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> యనమలకుదురులో విరిగిపడిన కొండచరియలు..

    ==> పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు..

    ==> రాళ్ల కింద పడి సుమారు 20 మేకల మృతి..

    ==> లక్షల రూపాయల నష్టంతో దిగాలైపోయిన కుటుంబం. 

    ==> ఘటన స్థలాన్ని పరిశీలించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్.
     

  • Andhra Pradesh Rains Live Updates: తూర్పు గోదావరి: అధిక వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన  జిల్లా యంత్రాంగం 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> జిల్లావ్యాప్తంగా  22 కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు 

    ==> ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ప్రకటన

    ==> రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నెంబర్ - 8977935609

  • Andhra Pradesh Rains Live Updates: తూర్పు గోదావరి: అధిక వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన  జిల్లా యంత్రాంగం 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> జిల్లావ్యాప్తంగా  22 కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు 

    ==> ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ప్రకటన

    ==> రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నెంబర్ - 8977935609

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link