Hyderabad Rains Live: ఆకాశానికి చిల్లు.. తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రతాపం
AP and Telangana Rains Live Updates: బంగాళాఖాతాంలో ఏర్పడిన అల్పపీడకం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కుంబపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. రోడ్లపై వర్షపు నీరు చేరింది. ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని సూచించింది. వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
AP and Telangana Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలోని వాయువ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడగా.. మరో 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతం కానుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం అధికారులు చేస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Latest Updates
AP Rains Live Updates:
==> విజయవాడ గుంటూరు జాతీయ ప్రధాన రహాదారి మంగళగిరి టోల్ ప్లాజా వద్ద రాకపోకలు తీవ్ర అంతరాయం
==> గుంటూరు ఆటోనగర్, పెద్దకాకాని పోలీస్ స్టేషన్ సమీపం అంతా జలమయం
==> టోల్గేట్ దగ్గర భారీగా వరద నీరు జాతీయ ప్రధాన రహాదారిపైకి రావటంతో ట్రాఫిక్ సమస్య
==> నీటితో జలాశయం లా కనిపిస్తున్న టోల్గేట్ ప్రాంతం
==> గుంటూరు విజయవాడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు. అప్రమత్తం ఉండాలని ప్రయాణాలు అపుకోవాలని హితవు
==> ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు విజ్ఞప్తి
Telangana Rains Live Updates: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జడ్చర్ల పట్టణ కేంద్రంలోని తెల్లవారుజాము నుంచి కురిసిన కుండపోత వర్షానికి పట్టణంలో ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు దిగువ ప్రాంతానికి చేరుకుంది. దీంతో జడ్చర్ల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి వరద దిగ్బంధంలో చిక్కుకుంది. ఆస్పత్రి లోతట్టు ప్రాంతంలో నిర్మించడంతో గతంలో ఎప్పుడు లేని విధంగా వరద ప్రవాహానికి ఆసుపత్రి ప్రాంగణమంతా చెరువును తలపించింది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు, వైద్య సిబ్బంది ఆస్పత్రికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Telangana Rains Live Updates: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ గట్టుప్పల్ నాంపల్లి మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. నాగార్జునసాగర్ మూసి ప్రాజెక్టులకు వరద పోటేతుండడంతో దిగకు నీటి విడుదల కొనసాగుతుండడంతో పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
AP Rains Live Updates: ఆంధ్రప్రదేశ్ వర్షాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Hyderabad Rains Live Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు విజయవాడలో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్ సమీపంలోని గుడిలో వర్షపు నీరు ప్రవేశించింది. కొండపల్లి మున్సిపాలిటీలో అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. నందిగామ మండలం చందాపురం వద్ద నల్లవాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.