IMD Heavy Rains Alert: బంగాళాఖాతంలోని వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడింది. రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుుతన్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడింది. రానున్న 36 గంటల్లో ఇది వాయుగుండంగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
ఇవాళ అంటే ఆగస్టు 31వ తేదీన అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, తిరుపతి, సత్యసాయి, అన్నమయ్య, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడనున్నాయి.
ఇదే పరిస్థితి సోమవారం వరకూ కొనసాగవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక బాపట్ల, పల్నాడు,, ప్రకాశం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. మొత్తానికి అలపపీడనం ప్రబావంతో ఏపీ అంతటా భారీ వర్షాలు పడనున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న మూడు రోజులు భారీ నుచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
Also read: YS Jagan: గుడ్లవల్లేరు రహాస్య కెమెరాల ఘటనపై మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.