Vizianagaram Train Accident News: విజయనగరం రైలు ప్రమాదం లైవ్ అప్‌డేట్స్.. అసలు ఏం జరిగిందంటే..?
Vizianagaram Train Accident Live Updates: విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Vizianagaram Train Accident Live Updates: విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి 7 సమయంలో పలాస ప్యాసింజర్ రైలు పట్టాలపై ఆగి ఉండగా.. వెనుక నుంచి విశాఖ-రాయగడ రైలును ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. పక్క ట్రాక్‌లో వెళుతున్న గూడ్స్ ట్రైన్‌పై బోగీలు దూసుకెళ్లడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయాలు అయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో రాత్రి వేళ ప్రమాద స్థలంలో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. క్షతగాత్రులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భీతవాహ పరిస్థితి నెలకొంది. రైలు ప్రమాదం నేపథ్యంలో అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Latest Updates
రైల్వే ట్రాక్ పునరుద్ధరణ తరువాత మొదటి రైలు ప్రయాణం
రైలు ప్రమాదంలో ఏడు నుజ్జునుజ్జు కావడంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. క్యారేజీలను తొలగించేందుకు విశాఖపట్నం నుంచి బాహుబలి క్రేన్‌ను రప్పించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్యారేజీల కదలికను వేగవంతం చేయడానికి.. ట్రాక్‌లను సరిచేయడానికి సహాయక బృందాలు ఆదివారం రాత్రి నుంచి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. పలాస ప్యాసింజర్ రైలు నుంచి 11 క్యారేజీలను అలమండ స్టేషన్‌కు తరలించారు. రాయగడ రైలు నుంచి తొమ్మిది క్యారేజీలను కంటకపల్లి స్టేషన్‌కు తరలించారు. తక్షణ వైద్య సహాయం కోసం రెండు అంబులెన్సులను ప్రమాద స్థలానికి సమీపంలో ఉంచారు.
విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. విజయనగరం రైలు పట్టాలు తప్పిన ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు.
==> ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయనగరం జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు
==> రైల్వే అధికారుల విజ్ఞప్తి మేరకు రైలు ప్రమాద ఘటనా స్ధల పరిశీలన కార్యక్రమం రద్దు
==> ఘటనా స్ధలంలో ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి యుద్ద ప్రాతిపదినక ట్రాక్ పునురుద్ధరణ పనులు చేపడుతున్నట్టు తెలిపిన అధికారులు
==> ముఖ్యమంత్రి ఘటనా స్ధలానికి వస్తే.. ట్రాక్ పునరుద్ధరణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని విజ్ఞప్తి చేసిన రైల్వే అధికారులు
==> రైల్వే అధికారుల విజ్ఞప్తితో సీఎం ప్రమాద ఘటనా స్థల పరిశీలన కార్యక్రమం రద్దు.
==> నేరుగా విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
==> ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయనగరం జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు
==> రైల్వే అధికారుల విజ్ఞప్తి మేరకు రైలు ప్రమాద ఘటనా స్ధల పరిశీలన కార్యక్రమం రద్దు
==> ఘటనా స్ధలంలో ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి యుద్ద ప్రాతిపదినక ట్రాక్ పునురుద్ధరణ పనులు చేపడుతున్నట్టు తెలిపిన అధికారులు
==> ముఖ్యమంత్రి ఘటనా స్ధలానికి వస్తే.. ట్రాక్ పునరుద్ధరణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని విజ్ఞప్తి చేసిన రైల్వే అధికారులు
==> రైల్వే అధికారుల విజ్ఞప్తితో సీఎం ప్రమాద ఘటనా స్థల పరిశీలన కార్యక్రమం రద్దు.
==> నేరుగా విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
భీమాలి వద్ద ట్రాక్ పునరుద్ధరణ పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. బోగీలు నుజ్జునుజ్జు కావడంతో ఇప్పటికే వాటిని పెద్ద యంత్రాల సాయంతో తొలగించారు. బాహుబలి క్రేన్‌లతో బోగీలను తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
రైల్ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు ఇలా..
==> గిరిజాల లక్ష్మి (35).
ఎస్.పి.రామచంద్రాపురం.
జి.సిగడాం మండలం.
శ్రీకాకుళం జిల్లా.==> కంచు భారతి రవి (30).
జోడుకొమ్ము (గ్రామం),
జామి (మండలం),
విజయనగరం జిల్లా.==> చల్లా సతీష్ (32)
ప్రదీప్ నగర్,
విజయనగరం జిల్లా.==> ఎస్.హెచ్.ఎస్.రావు
రాయఘడ పాసింజర్ లోకో పైలట్.
ఉత్తరప్రదేశ్.==> కరణం అక్కలనాయుడు (45),
కాపు సంబాం (గ్రామం),
గరివిడి (మండలం),
విజయనగరం జిల్లా.==> విశాఖ పాసింజర్ రైలు గార్డు పేరు తెలియదు.
==> మరో మృతదేహాన్ని గుర్తించేందుకు బందువులు రావలసి వుంది.
==> ఆరు మృత దేహాలు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో ఉండగా.. ఒక మృతదేహం మిమ్స్ ఆసుపత్రి మార్చురీలో ఉంది.
రైలు ప్రమాదంపై ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్వో విశ్వజీత్ సాహు స్పందించారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆదివారం రాత్రి 12 గంటల వరకు ప్రజలను రక్షించామని తెలిపారు. ఈరోజు సాయంత్రం 4 గంటలలోపు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి కానున్నాయని పేర్కొన్నారు.
విజయనగరం జిల్లాలో జరిగన రైలు ప్రమాద నేపథ్యంలో అధికారులు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం ఎప్పుడైనా ఈ నంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
విజయనగరం రైలు ప్రమాదంపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఒడిశా తరహాలోనే సిగ్నలింగ్ లోపమా లేక మరే ఇతర కారణముందా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. రైల్వే వ్యవస్థ నిర్లక్ష్యంపై ఆరోపణలు తీవ్రమౌతున్నాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
==> రైలు ప్రమాద ఘటనాస్థలానికి సీఎం జగన్ వెళ్లనున్నారు.
==> రైలు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం జగన్ పరామర్శించనున్నారు.
==> సీఎం పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.