పాఠశాల విద్యలో పెను మార్పు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు విద్యాహక్కు చట్టం కింద 8వ తరగతి వరకు విద్యార్థులను డిటైన్ చేయడానికి వీల్లేదు. ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా వారిని పై తరగతికి పంపించాల్సిందే. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండబోదు..తాజాగా విద్యాహక్కు చట్టంలో సవరణ తీసుకొచ్చారు. దీన్ని అనుసరించి  ఇప్పటి వరకు ఉన్న ‘నో డిటెన్షన్’ విధానం రద్దు కానుంది. ఈ మేరకు విద్యాహక్కు చట్టంలో తీసుకొచ్చిన సవరణ బిల్లుకు లోక్ సభ బుధవారం ఆమోదం తెలిసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా లోక్ సభ ఆమోదం పొందిన బిల్లు అమల్లోకి వస్తే పాఠశాల విద్యలో డిటెన్షన్ విధానం తిరిగి అమల్లోకి రానుంది. స్కూల్ విద్యార్థులు కూడా ఇక పాసైతేనే పై తరగతికి ప్రయోట్ అవుతారు. లేదంటే అదే తరగతి చదవాల్సి ఉంటుంది. అయితే 5, 8 తరగతుల విద్యార్థులకు మాత్రం ఈ విషయంలో మరో అవకాశం ఇస్తారు.


నిర్ణయం రాష్ట్రాలదే


బిల్లు ఆమోదంతో ఇప్పటి వరకు ఉన్న ‘నో డిటెన్షన్’ విధానం రద్దు కానుంది. అయితే, ఈ విధానాన్ని రద్దు చేయాలా ? కొనసాగించాలా? అనేది ఆయా రాష్ట్రాల విచక్షణపై ఆధారపడి ఉంటుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.


బిల్లుపై భిన్నాభిప్రాయాలు
లోక్ సభలో తాజాగా తీసుకొచ్చిన బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మోడీ సర్కార్ తీసుకొచ్చిన తాజా బిల్లుతో పాఠశాల విద్య మరింత బలోపేతం అవుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విదానం వల్ల విద్యా వ్యవస్థ బలహీనమౌతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. తాజా విధానం వల్ల విద్యార్ధులపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. కార్పోరేట్ స్కూళ్ల విషయం అటుంచితే ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికీ టీచర్ల కొరత ఉంది.మౌలిక సదుపాయాలు కరవు..ఇలాంటి పరిస్థితిలో ఈ విధానం అమలైతే స్కూలుకు వచ్చి చదువుకునే పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.