Loksabha elections results 2024: మన దేశంతో  పాటు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆసక్తి చూపిస్తున్నట్లు  తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ముఖ్యంగా ఇరు తెలుగు స్టేట్స్ లలో.. ఎన్నికలు నరాలు తేగే ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో.. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు.. బీఆర్‌ఎస్ కూడా ప్రజలు తమకే పట్టకడుతారని నమ్మకంతో ఉన్నారు. ఇక ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమంటూ కూడా నేతలు ధీమాతో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more; Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..


ఇక ఏపీలో.. కూడా ఎన్నికల మరింత టెన్షన్ ను రేకెత్తిస్తున్నాయి. అధికార వైఎస్సార్సీపీ ప్రజలు తమకే పట్టం కడుతారంటూ కూడా నమ్మకంతో ఉంది. మరోవైపు.. టీడీపీ, జనసేన,బీజేపీ గెలుస్తారని కూడా ఆశాభావంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ కూడా తమకు ప్రజలు మంచి మెజారీటీ ఇస్తారని కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు.


ఇప్పటికే దేశంలో.. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో..పల్నాడు జిల్లాలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. చిలకలూరీ పేట సెగ్మెంట్ ఆయా పార్టీలు తమ వారిని ఏజెంట్ లుగా నియమించారు. ఈ క్రమంలో.. టీడీపీ ఏజెంట్ కు టెన్షన్ కు గురయినట్లు ఉన్నాడు. టీడీపీ ఏజెంట్ రమేష్ కు గుండెపోటుకు గురయ్యాడు.  


Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..


వెంటనే అక్కడి అధికారులు అంబులెన్స్‌ కు కాల్ చేశారు. వెంటనే రమేష్ ను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు టెస్టులు చేయగా.. అప్పటికే టీడీపీ ఏజెంట్ చనిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. స్థానిక టీడీపీ పార్టీ మరో వ్యక్తిని అక్కడ టీడీపీ ఏజెంట్ గా నియమించారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter