Heavy Rains Alert: ఏపీలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు పడనున్నాయి. మరోవైపు నవంబర్ మొదటివారంలో తుపాను హెచ్చరిక ఇప్పటికే జారీ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో తూర్పు గాలులు తక్కువ ఎత్తులో రాష్ట్రం వైపు బలంగా వీస్తున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ(IMD) అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు(Heavy Rains)పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. నవంబర్‌ మొదటి వారంలో కోస్తాంధ్ర జిల్లాల్లో సైతం ఎక్కువగా వర్షాలు కురిసే సూచనలున్నాయని చెబుతున్నారు.


మరోవైపు నవంబర్ 6న ఏర్పడనున్న అల్పపీడనం(Low Pressure)తుపానుగా మారనుందనే హెచ్చరిక ఇప్పటికే జారీ అయింది. ఇది ఆంధ్రప్రదేశ్‌ వైపు వస్తుందా లేక దిశ మార్చుకుంటుందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదంటున్నారు. గత 24 గంటల్లో పెదకాకానిలో 79.75 మిల్లీమీటర్లు, శృంగవరపుకోటలో 55.5 మిల్లీమీటర్లు, అద్దంకిలో 54.25 మిల్లీమీటర్లు, జీకే వీధిలో 53 మిల్లీమీటర్లు, అనంతగిరిలో 51, వేమనపురంలో 49, జగ్గయ్యపేటలో 48.25, చింతలపూడిలో 46.5, తాడిమర్రిలో 45.75 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.  


Also read: Lanino Effect: ఈసారి ఉత్తరాది వణికిపోనుందా, భారీగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి