Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా ఏపీలో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. రానున్న 2-3 రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఏపీలో వాతావరణం రానున్న 2-3 రోజుల్లో ఎలా ఉండనుందో తెలుసుకుందాం.
ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్తా 16వ తేదీనాటికి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి దక్షిణ ధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఫలితంగా ఇవాళ్టి నుంచి 2-3 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.
రెండు మూడు రోజుల పాటు రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కూడా పడవచ్చు. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే స్థితిని బట్టి భారీ వర్షాలు ఇంకా కొనసాగవచ్చు. అటు గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌పై తుపాను ఆవర్తనం దక్షణ అండమాన్ మీదుగా కదులుతోందని తెలుస్తోంది. అందుకే పశ్చిమ వాయవ్యంగా కదులుతూ నవంబర్ 16 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుంది. నైరుతి బంగాళాఖాతంలో మరో తుపాను ఆవర్తనం ఉంది. ఈ రెండింటి కారణంగా తమిళనాడు తీరప్రాంతాలు, ఏపీలోని దక్షిణ కోస్తాలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక నవంబర్ 15, 16 తేదీల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడనున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం తుపానుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.
Also read: CM Jagan: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. ఒక్కొక్కరికి రూ.లక్షన్నర వరకు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook