విశాఖపట్నం: ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, శనివారం మాత్రం ఉత్తరాంధ్రలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 


ప్రస్తుతం దేశం నలుమూలలా అనేక ప్రాంతాల్లో వర్షాలకు అనుకూలమైన వాతావరణం కొనసాగుతోంది. శనివారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల రెండు రోజుల్లో ఇది మరింత బలపడనుంది. దీంతో తూర్పు, మధ్య భారతంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.