Thippeswamy name dropped in last minute: అనేక ఊహాగానాలు... లీకుల నడుమ ఎట్టకేలకు ఏపీ కొత్త కేబినెట్ జాబితా ఖరారైన సంగతి తెలిసిందే. పాత కేబినెట్‌లోని 11 మందితో పాటు 14 కొత్త ముఖాలకు కేబినెట్‌లో అవకాశం కల్పించారు. ఈ కొత్త ముఖాల్లో మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి పేరు కూడా ఉన్నట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో జాబితాలో మార్పులు, చేర్పులు చేయడంతో తిప్పేస్వామికి నిరాశే మిగిలింది. తిప్పేస్వామిని తప్పించి పాత మంత్రి ఆదిమూలపు సురేష్‌నే కొనసాగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి మంత్రుల తుది జాబితాలో ఆదిమూలపు సురేష్ పేరును కూడా చేర్చారు. అయితే ప్రకాశం జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అడ్డుపడటంతో ఆదిమూలపు సురేష్ పేరును జాబితా నుంచి తొలగించారు. సురేష్ స్థానంలో ఆయన బావ, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి చోటు కల్పించారు. దీంతో తిప్పేస్వామికి మంత్రి పదవి ఖరారైందంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే జాబితా నుంచి తిప్పేస్వామి పేరును పక్కనపెట్టేశారు.


ప్రకాశం జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండట్లేదనే కారణంతో తిరిగి ఆదిమూలపు సురేష్ పేరునే జాబితాలో చేర్చారు. దీంతో చివరి నిమిషంలో తిప్పేస్వామికి మంత్రి పదవి చేజారినట్లే అయింది. బావ, బావమరుదుల మధ్య దోబూచులాడిన మంత్రి పదవి చివరకు బావమరిది ఆదిమూలపు సురేష్‌నే వరించింది.


కాగా, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వైసీపీలో మంటలు రేపుతోంది. మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతలు, మంత్రివర్గం నుంచి ఔట్ అయినవారు పార్టీ అధిష్టానంపై భగ్గుమంటున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని ఉదయభాను, మేకతోటి సుచరిత, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్థసారథి ఇలా పలువురు నేతలు బాహాటంగానే తమ అసంతృప్తిని బయటపెట్టారు. ఆయా నేతల అనుచరులు రోడ్డెక్కి పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేపట్టారు. మంత్రి పదవి దక్కనివారు నిరాశకు గురవొద్దని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేసినప్పటికీ వారిలో ఆగ్రహావేశాలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించట్లేదు.


Also Read: Secret Affair: ప్రముఖ డైరెక్టర్‌తో సీక్రెట్ ఎఫైర్... ప్రెగ్నెన్సీ కూడా... బాంబు పేల్చిన నటి మందనా కరిమి...


Weekly Horoscope: రాశి ఫలాలు ఏప్రిల్ 11-ఏప్రిల్ 17... ఆ రాశి వారికి ఆర్థిక నష్టాలు తప్పకపోవచ్చు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook