మహాత్ముని వంటి ఒక వ్యక్తి ఈ భూమిపై సంచరించారంటే, ముందు తరాలవారు నమ్మకపోవచ్చని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ చెప్పారంటే..ఆ మహనీయుని కీర్తి ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. గాంధీ జయంతి సందర్బంగా గోదావరి తీరంతో మహాత్మాగాంధీ అనుబంధాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


స్వాతంత్ర్యోద్యమకాలంలో ( Freedom Struggle movement ) హింసే ఆయుధంగా సత్యమే మార్గంగా బ్రిటీషు తెల్లదొరల్నించి దేశానికి స్వాతంత్ర్యాన్ని( Independence ) తెచ్చిపెట్టిన గాంధీ (  Gandhiji ) ఎప్పటికీ మార్గదర్శకుడే. అందుకే జాతిపిత అయ్యారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి ( October 2 Gandhi jayanti ) సందర్బంగా జాతిపిత మహాత్మాగాంధీకు గోదావరి తీరంతో ముఖ్యంగా రాజమహేంద్రవరం ( Rajamahendravaram ) తో ఉన్న అనుబంధాన్ని ఓ సారి గుర్తు తెచ్చుకుందాం. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఐదుసార్లు మహాత్ముడు రాజమహేంద్రవరానికి వచ్చారు.


1921–46 మధ్య కాలంలో ఐదుసార్లు రాజమహేంద్రవరం ( Gandhiji Visited Rajahmundy ) గడ్డపై అడుగెట్టారు. తొలిసారిగా 1921 మార్చి 30న రాజమహేంద్రవరాన్ని సందర్శించారు. అనంతరం అదే ఏడాది ఏప్రిల్‌ 4న, తిరిగి 1929 మే 6న, తరువాత 1933 డిసెంబర్‌ 25న, చివరిగా 1946 జనవరి 20వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగిన పలు బహిరంగ సభల్లో ప్రసంగించారు. 1929, 1933 పర్యటనల్లో సీతానగరంలో ఉన్న గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమంలో బస చేశారు. కస్తూరిబా ఆశ్రమంగా ( Kasthuriba Ashramam ) పిల్చుకునే ఆ ఆశ్రమంలో ఇప్పటికీ  నాడు గాంధీజీ ఉపయోగించిన రాట్నాన్ని భద్రపరిచారు.1929 మే 6వ తేదీన కందుకూరి వీరేశలింగ పురమందిరంలో స్త్రీ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.1929 పర్యటనల్లో పాల్‌ చౌక్‌ వద్ద జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ఈ పాల్ చౌక్ నే ఇప్పుడు ఇన్నిస్ పేటగా పిలుస్తున్నారు. 


మరోసారి 1946 జనవరి 20 వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ప్రాంతంలోని గూడ్స్ యార్డ్ ప్రాంతంలో జరిగిన మహాత్మా గాంధీ ప్రసంగాన్ని ఇప్పటికీ చాలామంది గుర్తుంచుకుంటారు. నాటి ప్రసంగంలో తెల్లదొరలకు వ్యతిరేకంగా జాతినుద్దేశించి గాంధీజీ చేసిన ప్రసంగం అణువణువునా జాతీయోద్యమ భావాన్ని ఉత్తేజితం చేసింది. మహాత్మా గాంధీ చేసిన హిందీ ప్రసంగాన్ని స్వాతంత్ర్య సమరయోధుడైన కళా వెంకట్రావు తెలుగులోకి అనువదించారు. గోదావరి ప్రాంతంలో అదే గాంధీజీ చివరి పర్యటన. Also read: Rahul Gandhi: మోదీజీ మాత్రమే దేశంలో నడుస్తారా..?


[[{"fid":"194216","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Gandhiji at Devatha bhavan and kasthuri ba Ashramam","field_file_image_title_text[und][0][value]":"గాంధీజీ బస చేసిన దేవత భవన్..కస్తూరి బా ఆశ్రమంలో రాట్నం నడిపిన గాంధీజీ"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Gandhiji at Devatha bhavan and kasthuri ba Ashramam","field_file_image_title_text[und][0][value]":"గాంధీజీ బస చేసిన దేవత భవన్..కస్తూరి బా ఆశ్రమంలో రాట్నం నడిపిన గాంధీజీ"}},"link_text":false,"attributes":{"alt":"Gandhiji at Devatha bhavan and kasthuri ba Ashramam","title":"గాంధీజీ బస చేసిన దేవత భవన్..కస్తూరి బా ఆశ్రమంలో రాట్నం నడిపిన గాంధీజీ","class":"media-element file-default","data-delta":"1"}}]]


అప్పుడు గాంధీజీ సందర్శించిన దేవతా భవన్ ( Devata Bhavan )  రాజమహేంద్రవరం మెయిన్ రోడ్ లో ఉంది. 1930లో మహాత్మాగాంధీ రాజమండ్రి పర్యటించినప్పుడు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడైన దేవత శ్రీరామమూర్తి..గాంధీజీని తన నివాసమైన దేవత భవన్ కు ఆహ్వానించి మర్యాదలు చేశారు. స్వరాజ్యనిధి కోసం తన పెద్ద కోడలైన దేవత సూర్యకాంతం చేతుల మీదుగా గాంధీజీకు..చేతి వజ్రాలతో నిండిన ఏడువారాల నగల్నివిరాళంగా అందించారు. మరో విశేషమేమంటే..అహింసాయుత సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ( Nethaji Subhash chandra bose ) కూడా ఇదే దేవతా భవన్ లో బస చేశారు అప్పట్లో. 


గోదావరి తీరంతో ఆయనకున్న అనుబంధం గానీ..ఆయన అడుగెట్టిన ప్రాంతాలు గానీ ఇప్పటితరం వారికి చాలా కొద్దిమందికే తెలుసు. గాంధీ జయంతి సందర్బంగా నాటి జ్ఞాపకాల్ని మరోసారి గుర్తు తెచ్చుకోవడం చాలా అవసరం. Also read: Supreme court: ఏపీ హైకోర్టుపై సుప్రీంకోర్టు అభ్యంతరం, విచారణలపై స్టే ఎందుకని ప్రశ్న