చేసిన అప్పు తీర్చేందుకు భార్య పిల్లలను అమ్మకానికి పెట్టిన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కోయిలకుంట్లకు చెందిన పసుపులేటి మద్దిలేటి(38).. మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. చేసిన అప్పుల భారం పెరగడంతో.. ఇక చేసేదేమీ లేక.. అప్పులు తీర్చడానికి భార్య, పిల్లలను అమ్మాలని ఓ నిర్ణయానికి వచ్చాడు.  


భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో.. పెద్ద కూతురు(17)ను తన బంధువులకు గతేడాది రూ.1.50 లక్షలకు అమ్మేశాడు. తాజాగా రూ.5 లక్షల అప్పులు తీర్చేందుకు భార్య, మిగితా ముగ్గురు పిల్లలను అమ్మేశాడు. ఇందుకు అంగీకరించని భార్య. .అతడి వద్ద నుంచి తప్పించుకొని నంద్యాల పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని తెలిపింది. బాధితురాలి బంధువులను విచారించి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. నంద్యాల అర్బన్‌ ఐసీడీఎస్‌, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు ఆమెకు అండగా నిలిచి.. పిల్లలను పాఠశాలలో చేర్పిస్తామన్నారు.