Cyclone Mandous Effect In Ap: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో  తీవ్రతుఫానుగా మాండూస్ కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతుందని చెప్పారు. రాగల 6 గంటల్లో తీవ్ర తుఫాను తీవ్రతను కొనసాగించి.. ఆ తర్వాత క్రమంగా బలహీనపడనుందన్నారు. ప్రస్తుతానికి జఫ్నా(శ్రీలంక) తూర్పు ఆగ్నేయంగా 240కి.మీ., కారైకాల్‌కు 240 కి.మీ., చెన్నైకి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారు జాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో  అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.


మాండస్ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాయలసీమ, దక్షిణ కోస్తాల జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం అర్ధరాత్రి నాటికి పుదుచ్చేరి, మహా బలిపురం, శ్రీహరికోటల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 10వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.


ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లాల్లో ఒకటి, నెల్లూరు జిల్లాలో 2, తిరుపతి జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1 మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాని సీఎస్ తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఒకటి వంతున మొత్తం 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచామన్నారు. వర్షాలు, భారీ వర్షాలతో ఎక్కడైనా రహదారులకు లేదా ఇతర కమ్యునికేషన్ వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తితే సత్వర చర్యలు తీసుకునేలా సర్వసన్నద్ధమై ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.


Also Read: Chamika Karunaratne: అయ్యో కరుణరత్నే.. క్యాచ్ కోసం మూతి పళ్లు రాళగొట్టుకున్నాడు.. వీడియో వైరల్  


Also Read: Minister KTR: సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు.. కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook