Chamika Karunaratne Catch Video: లంక ప్రీమియర్ లీగ్‌లో క్యాచ్ పట్టే క్రమంలో బాల్ ముఖానికి తగిలి స్టార్ ఆటగాడు చమీక కరుణరత్నే గాయపడ్డాడు. హైక్యాచ్ అందుకునే క్రమంలో మూతి పళ్లు రాళగొట్టుకున్నాడు. క్యాండీ ఫాల్కన్స్, గాలే గ్లాడియేటర్స్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరిగిన మ్యాచ్‌లో ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. గాయపడిన కరుణరత్నే వెంటనే మైదానం విడిచి వెళ్లిపోయాడు.
గాలే గ్లాడియేటర్స్ జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. కార్లెస్ బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ ఫెర్నాండో భారీ షాట్‌కు యత్నించాడు. అయితే సరిగా టైమింగ్ కాకపోవడంతో గాల్లోకి లేచింది. చాలా హైగా వెళ్లిన బంతిని పట్టుకునేందుకు కరుణరత్నేతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు పరిగెత్తారు. కరుణరత్నే క్యాచ్ తీసుకుంటున్నారని సహచర ఆటగాళ్లు పక్కన నిల్చుండిపోయారు. పైనుంచి వస్తున్న బంతి గమనాన్ని సరిగా అంచనా వేయలేకపోవడంతో బంతి నేరుగా వచ్చి అతని ముఖంపై పడింది.
వెంటనే రక్తం కారి.. నాలుగు పళ్లు ఊడిపోయాయి. అయినా అతను క్యాచ్ వదలకుండా పట్టుకుని.. పక్కనున్న ఆటగాడికి బంతిని ఇచ్చాడు. రక్తం కారుతున్న ముఖంతో గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఫిజియో సలహా మేరకు కరుణరత్నేను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు నాలుగు పళ్లు ఊడిపోయాయని.. సర్జరీ చేయాలని తెలిపారు. ఇక ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Chamika hospitalized while attempting catch for Kandy Falcons#LPL2022 #LPL #ChamikaKarunaratne #Cricket pic.twitter.com/yrkT2bbhoG
— Ada Derana Sports (@AdaDeranaSports) December 7, 2022
ఈ మ్యాచ్‌లో క్యాండీ ఫాల్కన్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గాలె గ్లాడియేటర్స్ ఫాల్కన్స్‌కు 8 వికెట్ల నష్టానికి 122 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అనంతరం క్యాండీ ఫాల్కన్స్ 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఫాల్కన్స్ తరఫున కార్లోస్ బ్రాత్‌వైట్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. గాలె జట్టు భారీ స్కోరు చేయలేక మ్యాచ్‌లో ఓడిపోయింది.
ఇక ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన చమీక కరుణరత్నే ఏడాది నిషేధానికి గురైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్‌లో ఓ క్యాసినోలో తప్పతాగి అతను గొడవలు పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘించడంతో అంతర్జాతీయంగా ఏ ఫార్మాట్ ఆడకుండా ఒక సంవత్సరం నిషేధం విధించింది. అయితే లీగ్‌లు ఆడేందుకు మాత్రం అనుమతి ఉంది.
Also Read: Abhimanyu Easwaran: బంగ్లాతో టెస్టు సిరీస్.. రోహిత్ శర్మ స్థానంలో ఇండియా-ఎ ప్లేయర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి