Maoists Violence: ఆంధ్రా సరిహద్దులో అర్ధరాత్రి రెచ్చిపోయిన మావోస్టులు.. ప్రైవేట్ బస్సు తగులబెట్టి బీభత్సం!
Private bus on fire: ఆంధ్రా సరిహద్దులో మావోస్టులు దుశ్చర్చకు పాల్పడ్డారు. చింతూరు సమీపంలో ప్రైవేట్ బస్సును ఆపి.. అందులోని ప్రయాణీకులను దించేసి దానికి నిప్పంటించారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Maoist atrocity in chinturu agency: ఏపీ సరిహద్దులోని అల్లూరి జిల్లాలో (Alluri Sitarama Raju District) మావోస్టులు రెచ్చిపోయారు. చింతూరు ఏజెన్సీలోని కొత్తూరు దగ్గర ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ బస్సును మావోయిస్టులు (Maoists) తగులబెట్టారు. ప్యాసింజర్స్ ను దించేసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ బస్సు ఒడిశా నుంచి హైదరాబాద్ కు ప్రయాణికులతో వెళ్తుంది. ఈ రోజు దండకారణ్య బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతం ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా కుంటకు సమీపంలోనే ఉంది.
ఈ ఘటనతో జాతీయ రహదారి 30పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బస్సుకు నిప్పుంటించడంతో (Private bus on fire).. రాత్రివేళ కావడంతో బస్సులోని ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. మావోయిస్టుల ఈ చర్యతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దండకారణ్యం బంద్ పిలుపు నేపథ్యంలో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. అదనపు బలగాలను రప్పించేందుకు కూడా రెడీ అయ్యారు.
అక్కడి ఉండిపోయిన ప్రయాణికులను పోలీసుల ప్రత్యేక వాహనాల్లో వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడినప్పుడు..బస్సులో 25 మంది వరుకు ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల దుశ్చర్యతో చింతూరు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read: World Malaria Day: మలేరియా నివారణ చర్యల్లో ఏపీ భేష్... కేంద్రం నుంచి పురస్కారం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.