Goutham Reddy passes away: మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిపై అసత్య ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన మేకపాటి ఫ్యామిలీ
Goutham Reddy passes away: ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారంపై మేకపాటి కుటుంబం స్పందించి క్లారిటీ ఇచ్చింది.
Goutham Reddy passes away: ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం (Goutham Reddy passes away) చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మృతిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో (Social Media) వస్తున్న తప్పుడు కథనాలపై మేకపాటి ఫ్యామిలీ (Mekapati Family) క్లారిటీ ఇచ్చింది. గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలు అవాస్తవమని మంత్రి కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాత్రి ఆయన ఇంటికి చేరుకున్నపట్టి నుంచి ఆయన మృతి చెందే వరకు టైంతో సహా క్లారిటీ ఇచ్చింది మేకపాటి కుటుంబం.
గౌతమ్‌రెడ్డి ఫ్యామిలీ తెలిపిన వివరాల ప్రకారం...
** ఆదివారం రాత్రి జరిగిన ఓ ఫంక్షన్‌లో ఎప్పుడూ లాగే సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంటికి చేరారు.
** రోజూలాగే ఉదయం 6 గంటలకు నిద్రలేచారు.
** ఉదయం 6:30 గంటల వరకూ మంత్రిగారు ఫోన్లతో బిజీ అయ్యారు.
** 07.00 గంటలకు తన ఇంటిలోని రెండో అంతస్తు సోఫాలో మంత్రి కూర్చుని ఉన్నారు.
** ఉదయం 7:12 గంటలకు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి గౌతమ్ రెడ్డి చెప్పారు.
** 07:15గంటలకు సడన్ గా గుండెపోటు రావడంతో సోఫా నుంచి ఆయన మెల్లిగా కిందకి ఒరిగారు.
** ఉదయం 7:16 గంటలకు మంత్రి మేకపాటి భార్య శ్రీకీర్తి కంగారు పడి గట్టిగా అరిచారు.
** 07:18 గంటలకు పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న మేకపాటి ఛాతి మీద చేయితో నొక్కి డ్రైవర్ నాగేశ్వరరావు స్వల్ప ఉపశమనం కలిగించారు.
** 07:20 గంటలకు మంత్రి మేకపాటి పక్కనే ఉన్న సతీమణి శ్రీకీర్తి అప్రమత్తమయ్యారు.
** 07:20 గంటలకు మంచినీరు కావాలని అడిగిన మంత్రి మేకపాటి, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన సతీమణి శ్రీకీర్తి.. వెంటనే మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచారు.
** ఉదయం 07:22 ‘నొప్పి పెడుతుంది కీర్తి’ అంటున్న మంత్రి మాటలకు స్పందించి.. అక్కడి సిబ్బంది వెంటనే హాస్పిటల్ కు వెళదామని బయలుదేరారు.
** 07:27 మంత్రి ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపోలో ఆస్పత్రికి, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి మంత్రి మేకపాటి డ్రైవర్, సిబ్బంది తరలించారు.
** 08:15 గంటలకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని అపోలో వైద్యులు వెల్లడించారు.
** ఉదయం 09:13 గంటలకు మంత్రి మేకపాటి ఇక లేరని అపోలో ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు.
** ఉదయం 09:15 గంటలకు మంత్రి మేకపాటి మృతిచెందినట్లు అపోలో వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
Also Read: Mekapati Goutham Reddy: అవినీతిపరులకు ఆయనొక సింహ స్వప్నం.. గౌతమ్ రెడ్డి స్మృతులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook