Goutham Reddy Death: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికదేహానికి సీఎం జగన్ , తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళి

Goutham Reddy Death: ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికదేహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌతమ్ రెడ్డి సంతాపసభ నిర్వహించారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 21, 2022, 03:22 PM IST
  • హైదరాబాద్‌లో గౌతమ్ రెడ్డి భౌతికదేహానికి నివాళి అర్పించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
  • ఏపీ మంత్రి కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళులు
  • గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆవేదన చెందిన వైఎస్ జగన్
Goutham Reddy Death: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికదేహానికి సీఎం జగన్ , తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళి

Goutham Reddy Death: ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికదేహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌతమ్ రెడ్డి సంతాపసభ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. సహచర మంత్రి, స్నేహితుడైన గౌతమ్ రెడ్డి మరణవార్త వినగానే..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా హైదారాబాద్ బయలుదేరారు. గౌతమ్ రెడ్డి నివాసానికి చేరుకుని..కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఓదార్చారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. గౌతమ్ రెడ్డి భౌతికదేహానికి నివాళులు అర్పించారు. గౌతంరెడ్డితో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. చిన్ననాటినుంచే తనకు బాగా పరిచయమని వైఎస్ జగన్ ఆవేదన చెందారు. ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రిని, విద్యాధికుడ్ని కోల్పోయానని జగన్ విచారం వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారని గుర్తు చేశారు. 

అటు ఏపీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించారు. కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తనకు అత్యంత సన్నిహితుడనని..12 ఏళ్ల నుంచి పరిచయం ఉందని చెప్పారు. చిన్న వయస్సులోనే గౌతమ్‌రెడ్డి మరణం చాలా బాధాకరమన్నారు. గౌతమ్ రెడ్డి మరణం పట్ల కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు సంతాపం తెలిపారు. ఉన్నత ఆశయాలు, విలువలు కలిగిన గౌతమ్ రెడ్డి కుటుంబానికి మనోధైర్యం ప్రాప్తించాలని కోరారు. 

అటు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గౌతమ్‌రెడ్డి సంతాపసభలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు.

Also read: Goutham Reddy Death: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు ఇంట్లోనే పోయాయా..ఆ రెండు గంటలు ఏం జరిగింది ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News