Rains in AP next Three Days: ఆంధ్రప్రదేశ్‌కు అలర్ట్. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని హెచ్చరించారు. ఈశాన్య రుతుపవనాలు శనివారం నుంచి ప్రారంభం కానుండంతో భారతదేశం అంతటా వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతం మీదుగా ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాతుందని అధికారులు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింత్రాంగ్ తుఫాను ఎఫెక్ట్‌తో ఇప్పటికే మన దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బంగ్లాదేశ్‌పై సిత్రాంగ్‌ తుఫాను పంజా విసిరిసింది. దాదాపు 11 మంది మృత్యువాత పడ్డారు. అదేవిధంగా అసోం, పశ్చిమ బెంగాల్‌, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల మీదుగా కూడా జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ప్రజలను నిత్యం అలర్ట్ చేస్తూ.. అక్కడి అధికారులు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు.


 నేటి నుంచి కోస్తా ఆంధ్ర, యానాంలలో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆదివారం రాయలసీమతో పాటు కేరళల, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సమయంలో కోస్తాంధ్రలో 338.1 మి.మీ, రాయలసీమలో 223.3 మి.మీ వర్షపాతం నమోదవుతుంది. 


నైరుతి రుతుపవనాల కంటే.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతోనే బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడతాయని అధికారులు చెబుతున్నారు. వీటి ఎఫెక్ట్ దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు రాష్ట్రాలపై ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. సాధారణంగా ఈ సీజన్‌లో అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ల మధ్యలో కనీసం మూడు తుఫానులు ఏర్పడుతుండగా.. ఈసారి అంతకుమించి తుఫానులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.  


Also Read: Swara Bhaskar Trolls : నీకు ఇంతకంటే పెద్దది కావాలా?.. నెటిజన్ ట్వీట్ మీద స్వర భాస్కర్ కౌంటర్ వైరల్


Also Read: Chiranjeevi-Garikapati : మళ్లీ వివాదం షురూ.. గరికపాటి మీద చిరంజీవి పరోక్ష సెటైర్లు.. వీడియో వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook