Minister Perni Nani fire on tdp amaravati farmers padayatra: ఏపీలో నిజమైన రైతులను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (TDP chief Chandrababu Naidu) మోసం చేశారని ఏపీ రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఇప్పుడు పాదయాత్ర పేరుతో మరోసారి రైతులను చంద్రబాబు (Chandrababu) మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు పాదయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ (TDP) చేసిన పాపాలకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుని ఉంటే బాగుండేదని మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమరావతి రైతుల పేరుతో రియల్‌ ఎస్టేల్‌ వ్యాపారులు.. చంద్రబాబు ఏజెంట్లు, బినామీలు పాదయాత్ర చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. ఇక ఈ యాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే చంద్రబాబేనంటూ విమర్శించారు. టీడీపీ నేతలు చేపట్టిన ఈ యాత్రకు చందాల పేరుతో చంద్రబాబు అండ్ కో నల్లధనాన్ని (Black money) తెల్లధనంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. తన ఆస్తుల కోసం అమరావతి తప్పా ఏపీలో ఇంకో ప్రాంతం అభివృద్ధి జరగకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. కృష్ణా,గుంటూరు జిల్లా వాసులు సీఎం జగన్‌కు మద్దతుగా ఉన్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి గడ్డిపెట్టి వైసీపీ‌కే (YCP‌) ఇక్కడి ప్రజలు పట్టం గట్టారన్నారు.


Also Read : Zainab Abbas On Siraj: సిరాజ్ బౌలింగ్ కు ఫిదా అయిన పాకిస్థానీ యాంకర్


లోకేష్‌ను మానసిక వైద్యులకు చూపించాలన్నారు. ఈ రెండేళ్లులో చంద్రబాబు కుప్పానికి (Kuppam) ఒక్కసారి కూడా ఎందుకు వెళ్ళలేదని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. తండ్రీకొడుకులకు ఎన్నికలు రాగానే కుప్పం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. వైఎస్ పులి కాబట్టే ఆయన కడుపున పులి పుట్టిందని మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు నక్క అని ఆయన కడుపున గుంటనక్క లోకేష్ పుట్టాడని మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) ఎద్దేవా చేశారు.


Also Read : AP, TS ministers: తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మాటల తూటాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి