Minister Roja Comments on Pawan Kalyan: రాజకీయ నాయకులకు ఉండాల్సిన ఓర్పు, బాధ్యత లాంటి నాయకత్వ లక్షణాలు పవన్ కళ్యాణ్ కి ఏవీ లేవని మంత్రి రోజా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పరుష పదజాలంతో విరుచుకుపడిన మంత్రి రోజా.. జనంలోకి వచ్చేటప్పుడు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారని.. అలాంటప్పుడు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మళ్లీ మళ్లీ ఇప్పటం రావొద్దంటూ ఇప్పటంలోనే ప్రజలు చాలా స్పష్టంగా పెద్దపెద్ద ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారంటే ఆయనకి ఎంత వ్యతిరేకత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. కనీసం రోడ్లు వేయడానికి కూడా వీల్లేకపోవడంతో వారికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రోడ్ల విస్తరణ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి ప్రజలు కూడా అర్థం చేసుకుని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అందుకే పవన్ కళ్యాణ్ మళ్లీ మళ్లీ రావొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అని మంత్రి రోజా చెప్పుకొచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కళ్యాణ్ ఒళ్లు దగ్గరపెట్టుకో..
ఇప్పటం ప్రజలకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు ఇచ్చిన విషయాన్ని దాచిపెట్టి ఏపీ హై కోర్టును తప్పుదోవ పట్టించేలా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని ఎలా చెబుతారని మంత్రి రోజా పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. కానీ అసలు వాస్తవాన్ని హై కోర్టు కూడా అర్థం చేసుకుని వారికి జరిమానా విధించిందంటే.. అది హై కోర్టు లాగిపెట్టి లెంపకాయ కొట్టినట్టే అని అన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ బుద్ధి తెచ్చుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుంటే మంచిదని మంత్రి రోజా హితవు పలికారు. 


పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబు వాడుకుని ఫూల్‌ని చేస్తున్నారు
ఇప్పటంలో సమస్యకు చంద్రబాబు నాయుడు కారణం. అక్కడ సమస్య వస్తే చంద్రబాబు నాయుడో లేక ఆయన కొడుకు నారా లోకేష్ వెళ్లాలి కానీ అక్కడకు పవన్ కళ్యాణ్ ని పంపించి.. ఆయన చేత వైఎస్ జగన్ ని తిట్టించడం ఏంటని మంత్రి రోజా సందేహం వ్యక్తంచేశారు. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు వాడుకుని ఫూల్ ని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమస్యకు కారకులైన చంద్రబాబుని వదిలేసి.. ప్రతీసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడటం చూస్తోంటే.. పవన్ కళ్యాణ్ కేవలం తన ఉనికి కోసమే మాట్లాడుతున్నాడని అర్థమవుతోందన్నారు. 


దమ్ముంటే ఆ పని చేయ్ పవన్ కళ్యాణ్.. జనసేనానికి మంత్రి రోజా సవాల్
జనసేనాని పవన్ కళ్యాణ్‌కి దమ్ముంటే ఏపీలోని 175 స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను పోటీలో దింపమని మంత్రి రోజా సవాల్ విసిరారు. అలా పోటీ చేసినప్పుడే నువ్వు హీరోవి అవుతావని.. అలా కాకుండా సినిమాల్లో హీరో వేషాలు వేసి ఇక్కడ జీరో వేషాలు వేస్తే ప్రజలు నిన్ను హీరోను చేయరు అని పవన్ కళ్యాణ్ కి మంత్రి రోజా చురకలు అంటించారు.


పిచ్చి పిచ్చి వేషాలేయొద్దు..
పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి మంత్రి రోజా మాట్లాడుతూ.. నాయకుడికి ఓర్పు, బాధ్యత ఎంతో అవసరం అని.. పవన్ కళ్యాణ్ కి అవి లేవని అన్నారు. వాహనంపైకి ఎక్కి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. ఆరోజు ఏదైనా జరిగి ఉంటే ఎంత మంది ప్రాణాలు పోయి ఉండేవని ఆందోళన వ్యక్తంచేశారు. ఓర్పు లేకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసే వారికి ప్రజలు ఎప్పటికీ ఓటు వేయరు అని మంత్రి రోజా హితవు పలికారు. ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం పాటు పడతారో ప్రజలు వారికే ఓటు వేస్తారని చెబుతూ.. వైఎస్ జగన్ మళ్లీ తిరుగులేని మెజార్టీతో గెలుస్తారని.. వైసీపీ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు.


పవన్ కళ్యాణ్ గతం అదే


పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తే.. రెండు చోట్లా ఓడిపోయారని వ్యాఖ్యానించిన మంత్రి రోజా సెల్వమణి.. పవన్ కళ్యాణ్ గతం అంటే అదేనని ఆయన ఓటమి గురించి పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు నేడు మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నాని సైతం పవన్ కళ్యాణ్ పై ఇదే స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ నేతలు చేస్తోన్న ఈ ఘాటు వ్యాఖ్యలపై జనసేనాని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఏమని స్పందిస్తారో చూడాలి మరి. 


Also Read : Jogi Ramesh, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పగటి వేషగాడు.. మంత్రి జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు


Also Read : Pawan Kalyan About Caste: దేశం భావన లేకపోయినా.. కులం భావన పెట్టుకోండి: పవన్ కళ్యాణ్


Also Read : AP Politics: ఏపీలో మారుతున్న సమీకరణాలు, టీడీపీ-జనసేన పొత్తుపై నీలినీడలేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook