Minister Roja: వాలంటీర్లు వారి చెంప చెల్లుమనించారు.. 175 స్థానాల్లో విజయం మాదే: మంత్రి రోజా
Minister Roja On Chandrababu Naidu: వాలంటీర్ల సేవలపై మంత్రి రోజా ప్రశంసల వర్షం కురిపించారు. లంచం అనే మాటకు తావులేకుండా ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నారని అన్నారు. జగనన్న సైనికులుగా ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నారన్నారు.
Minister Roja On Chandrababu Naidu: ఇళ్ల పట్టాల పంపిణీపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారని విమర్శించారు మంత్రి రోజా. నిరుపేదల జీవితాలు బాగుపడటం బాబుకు ఇష్టం లేదని మండిపడ్డారు. నిరుపేదలకు ఇచ్చే స్థలాలను సమాధులతో పోల్చడం ఏంటని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థతో సరికొత్త ఒరవడి తీసుకొచ్చామని అన్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో వాలింటీర్లకు వందనం కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. దేశమే గర్వించే విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని తెలిపారు. సూర్యుడి కంటే ముందుగా వాలింటీర్లు వృద్దులు, వికలాంగులు, వితంతువుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందచేస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్లు అంటే ముఠాలు, మోసం చేసేవాళ్లు విమర్శించిన వారికి చెంప చెల్లుమనిపించేలా చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా కరోనా సమయంలో సేవ చేయని విధంగా వాలంటీర్లు సేవ చేశారని గుర్తు చేశారు. లంచం అనే మాట లేకుండా వారి ఇంటి వద్దకే వెళ్లి వారి సమస్యను తీరుస్తున్నారన్నారు. జగనన్న సైనికులుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచారని కొనియాడారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి రోజా. అమరావతి భూములను నిరుపేదలకు పంపిణీ చేస్తుంటే.. చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు బాగుపడుతుంటే.. చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. నిరుపేదలకు ఇచ్చే స్థలాలను సమాధులతో పోల్చడం ఏంటని అంటూ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆ సమాధుల్లోనే తెలుగుదేశం పార్టీ ప్రజలు పూడ్చేస్తారని జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థను ప్రజలు మెచ్చుకుంటున్నారని.. కానీ చంద్రబాబు మాత్రం రాజకీయం చేస్తున్నారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థతో సీఎం జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు.
Also Read: Pawan Kalyan: ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి