PBKS Vs RR Dream11 Prediction: ఓడిన జట్టు ఇంటికే.. రాజస్థాన్‌తో పంజాబ్ ఫైట్.. డ్రీమ్ 11 టీమ్ ఇలా ఎంచుకోండి

Punjab Kings Vs Rajasthan Royals Dream 11 Tips and Top Picks: ఐపీఎల్‌లో నేడు మరో టీమ్ ఇంటి ముఖం పట్టనుంది. పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య పోరులో గెలిచిన జట్టు ఇతర జట్ల సమీకరణాల కోసం ఎదురుచూస్తుంది ఓడిన జట్టు టోర్నీ నుంచి తప్పుకుంటుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : May 19, 2023, 11:42 AM IST
PBKS Vs RR Dream11 Prediction: ఓడిన జట్టు ఇంటికే.. రాజస్థాన్‌తో పంజాబ్ ఫైట్.. డ్రీమ్ 11 టీమ్ ఇలా ఎంచుకోండి

Punjab Kings Vs Rajasthan Royals Dream 11 Tips and Top Picks: ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది. అన్ని జట్లు 13 మ్యాచ్‌లు ఆడేశాయి. ప్లే ఆఫ్స్ రేసుకు చేరే జట్లపై ఇంకా క్లారిటీ రాలేదు. గుజరాత్ టైటాన్స్ మాత్రమే అధికారికంగా చోటు దక్కించుకోగా.. మిగిలిన మూడు బెర్త్‌ల కోసం ఏడు జట్లు రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు కూడా 6 విజయాలతో 12 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే నెట్‌ రన్‌రేట్ పరంగా రాజస్థాన్ పాయింట్ల పట్టికలో పంజాబ్ కంటే ముందుస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఖాతాలో 14 పాయింట్ల వస్తాయి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు ఇతర జట్ల ఫలితాల ఆధారంగా సెమీస్ రేసులో ఉంటుంది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రారంభంకానుంది. పిచ్ రిపోర్ట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, ప్లేయింగ్ 11, డ్రీమ్ 11 టిప్స్ మీ కోసం..

పిచ్ రిపోర్ట్ ఇలా.. 

ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్ ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభంలో షాట్లు ఆడేందుకు ఈజీగా ఉంటుంది. అయితే మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పేసర్లు ప్రభావం చూపించే అవకాశం ఉంది. రెండు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండడంతో మరోసారి హైస్కోరింగ్ గేమ్‌గా సాగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఛేజింగ్ చేసిన జట్లు ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. 

హెడ్ టు హెడ్ రికార్డులు..

పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు మొత్తం 25 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో 14 మ్యాచ్‌లలో రాజస్థాన్ గెలుపొందగా.. మిగిలిన 11 మ్యాచ్‌లలో పంజాబ్ విజయం సాధించింది. చివరి ఐదు మ్యాచ్‌లలో రాజస్థాన్ మూడింటిలో గెలుపొందింది. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విక్టరీ సాధించింది. రెండు జట్లు బలంగా ఉండడంతో పోరు ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్ కాస్త పైచేయి సాధించే ఛాన్స్ ఉంది.

రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లివింగ్‌స్టోన్, జితేష్‌ శర్మ (వికెట్ కీపర్), అథర్వ టైడ్, సామ్ కర్రన్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్‌మెయర్, జోరూట్, రవిచంద్రన్ అశ్విన్, జురెల్, ట్రెంట్ బౌల్ట్, ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ.

డ్రీమ్ 11 టీమ్: 

జోస్ బట్లర్ (కెప్టెన్), సంజు శాంసన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్.

Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు  

Also Read: Pawan Kalyan: ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్ కళ్యాణ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News